బీజేపీ వ్యుహానికి ఆదిలోనే ఓవైసీ చెక్ : టీఆర్ఎస్ కు సరికొత్త మెలిక ?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకునే దిశగా ఎంఐఎం అడుగులు వేస్తోంది

Last Updated : Dec 10, 2018, 05:29 PM IST
బీజేపీ వ్యుహానికి ఆదిలోనే ఓవైసీ చెక్ : టీఆర్ఎస్ కు సరికొత్త మెలిక ?

ఎన్నికల్లో ఎలాంటి ఫలితం రాకుండా హంగ్ వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ హస్తానికి అధికారం నుంచి దూరం పెట్టాలనే బీజేపీ భావిస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కింగ్ మేకర్ గా అవతరించాలని ప్లాన్ చేస్తుంది. తన వ్యూహంలో భాగంగా హస్తం పార్టీకి అధికారం నుంచి దూరం పెట్టేందుకు టీఆర్ఎస్ కు మద్దతిచ్చేందుకు సిద్ధమౌతున్న తరుణంలో ఆ పార్టీ వ్యహాన్ని ఆదిలోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ చెక్ పెట్టారు. బీజేపీ వ్యూహాన్ని గమనించిన అసదుద్దీన్ తన రాజనీతిని ప్రదర్శించారు. ఇప్పటి వరకు పొత్తు విషయంలో సైలెంట్ గా ఉన్న ఓవైసీ ..తమ మద్దతు   టీఆర్ఎస్ పార్టీకేనని స్పష్టం చేశారు. పైగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కచ్చితమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ గెలుపు జాతీ నిర్మాణంలో ఇది తొలి అడుగు అని అసదుద్దీన్ ఓవైసీ ఈ  మేరకు ట్వీట్ చేశారు.

 

ఓవైసీ ఇంతటితో ఆగకుండా  హటాహుటిన క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను కలిసి తమ మద్దతు టీఆర్ఎస్ కే ఉంటుందని భారోసా ఇచ్చారు. లెక్కల్లో తేడా వస్తే ఎవరి ఎవరితో కలవాలి అన్నదానిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే ఇండిపెండెంట్ల మద్దతు తీసుకోవాలని కేసీఆర్ కు ఈ సందర్భంగా ఓవైసీ సూచించినట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్ ముందు బీజేపీ రూపంలో మరో ఆప్షన్ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సపోర్ట్ తీసుకుంటే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని కేసీఆర్ కు ఓవైసీ తెగేసి చెప్పినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలా మద్దతిచ్చే అంశంపై కసరత్తు చేస్తున్న బీజేపీ ఆలోచనకు ఆదిలోనే ఓవైసీ ఇలా చెక్ పెట్టారు.

Trending News