హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనదైన స్టైల్లో స్పందించారు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఓడిపోయే పార్టీ చెప్పే మాటే అది అన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని, నిన్న కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అసాధ్యం అని స్పష్టంచేసిందని కవిత గుర్తుచేశారు. ఏదేమైనా తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్కే పట్టం కట్టారని, దీంతో ఇంతకాలంపాటు కాంగ్రెస్ చెప్పుకున్నదంతా అబద్దం అని తేలిపోయిందని కవిత అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తుండటంపై ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. Assembly elections 2018 results and counting live updates : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి