Shani Vakri Effect 2024: జ్యోతిష్య శాస్త్రంలో చర్య, న్యాయానికి ప్రత్యేకగా పరిగణించే శని గ్రహం సంచారం, తిరోగమనం చేయడం కారణంగా ప్రత్యేకమైన ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా శని గ్రహం సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనడం చేయడం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శని గ్రహం ముఖంలోని శుభ స్థానంలో ఉన్న వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే సమాజంలో ప్రశంసలు కూడా లభిస్తాయి. అదే ఈ రాశి అశుభ స్థానంలో ఉంటే తీవ్ర సమస్యలతో పాటు ఆర్థిక నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కుంభరాశిలో శని వక్రీ జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే తిరోగమన చలనం నవంబర్ 15 వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా మేష వృషభ రాశితో పాటు కర్కాటక రాశి వారు ఎంతో ప్రభావితం అవుతారు.
నవంబర్ వరకు ఈ క్రింది రాశులకు జరగబోయేది ఇదే:
మేష రాశి:
మేష రాశి వారికి వృత్తిపరమైన జీవితంలో అనేక ఆటంకాలు హైదరాబాద్ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఊహించని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో కలహాలు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా శని తిరోగమన కారణంగా ఉద్యోగాల్లో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో బాధ్యతలు పెరుగుతాయి. వీరు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం ఎంతో మంచిది. అంతే కాకుండా శని తిరోగమన కారణంగా దీర్ఘకాలిక వ్యాధులకు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
తులారాశి:
నవంబర్ నెల వరకు తులా రాశి వారికి కార్యాలయాల్లో పోటీ తత్వం పెరుగుతుంది. దీని కారణంగా ఏదైనా పనిచేసేందుకు అంతగా ఆసక్తి రాకపోవచ్చు. ఇక ఆర్థిక విషయాల్లోకి వెళితే, డబ్బు దురాశ కారణంగా అనేక ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. అలాగే వీరికి ఆందోళన కూడా పెరుగుతుంది. ఇక కుటుంబ జీవితం గడిపే వారికి న్యాయవివాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా జీవనాన్ని కొనసాగించడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా ఉద్యోగాల్లో విపరీతమైన ఆటంకాలు నిరుద్యోగ సమస్యలు ఎదురవవచ్చు. కాబట్టి నవంబర్ నెల వరకు వీరు ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. అలాగే వీరికి రుణభారం కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే వీరు ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండటం చాలా మంచిది. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ జీవితం గడిపే వారు కూడా నవంబర్ నెల వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి