Prabhas Kalki Release date: గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలేని అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాలేదు. అన్ని సినిమాలు ముందుగా ఒక రిలీజ్ డేట్ చెప్పి.. ఆ తర్వాత వేరే డేట్స్లలో విడుదలైనవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా 'కల్కి 2898AD' విషయంలో అదే జరిగింది. ఈ సినిమా ఒక అడుగు ముందుకేస్తే..మూడడుగులు వెనక్కి అన్నట్టు చాలా స్లోగా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. కల్కి సినిమాను టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోంది. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో ప్రభాస్ కాల భైరవ పాత్రలో నటిస్తే.. అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామా పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముందుగా కల్కి సినిమాను సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత మే 9 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉంది. ప్రజలందరి మూడో దానిపైనే ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 13న పోలింగ్ డేట్ ఉంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే9న విడుదల చేయాలనుకున్న టీమ్ వెనకడుగు వేసింది. తాజాగా ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అంటే సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట.
ఓ వైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే నాగ్ అశ్విన్ మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ పై మంచి సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలు స్టోన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'కల్కి' మూవీ మహాభారత కాలంతో మొదలై సామాన్య శకం 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని 'కల్కి' మూవీలో ప్రేక్షకులకు చూపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతున్నట్టు మరో వార్త వినిపిస్తోంది. అంతేకాదు ఇందులో నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసారు. ఈ సినిమా తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీని చేయనున్నారు ప్రభాస్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఉండనే ఉంది. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్, అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేస్తున్నాడు. అటు కన్నప్ప సినిమాలో ప్రభాస్.. మహా శివుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ సంచలనం.. పిఠాపురంలో మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter