PM Modi - Rashmika: పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై భారీగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎన్నో అసాధ్యమనుకున్న పలు ప్రాజెక్ట్స్ నిర్మించి ప్రజల జీవితాన్ని మెరుగు పరిచారు. ఇప్పటికే అస్సామ్, అరుణాల్ ప్రదేశ్ వంటి దేశ భద్రతకు కీలమైన ప్రాంతాల్లో సెలా టన్నెల్స్ లాంటివి నిర్మించి అక్కడ ప్రజల జీవితాలతో పాటు దేశ భద్రతను పటిష్టపరిచే కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా. ఇలా దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. తాజాగా ముంబైలో నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ గురించి వివరస్తూ రష్మిక ఓ వీడియోను షేర్ చేసింది. న్యూ ఇండియా అంటూ నవీ ముంబై నుంచి పాత ముంబైకు రావాలంటే దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. తాజాగా నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్‌తో అది 20 నిమిషాలకు కుదించబడింది. ఇలా దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న విషయాన్ని ప్రస్తావించింది.
Absolutely! Nothing more satisfying than connecting people and improving lives. https://t.co/GZ3gbLN2bb
— Narendra Modi (@narendramodi) May 16, 2024
తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసారు. ఈ నెల 20న ముంబై సహా మిగిలిన మహారాష్ట్రలో ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోనన్ మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఓ వీడియో షేర్ చేసారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రష్మిక విషయానికొస్తే.. హిందీలో సల్మాన్ ఖాన్, మురుగదాస్‌ల 'సికందర్' మూవీలో కథానాయికగా నటిస్తోంది. దాంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.
Also Read: IPL 2024 RR vs PBKS: సామ్ కరాన్ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్ రాయల్స్ నాలుగో ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter