IPL 2024 RR vs PBKS: సామ్‌ కరాన్‌ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో ఓటమి

IPL 2024 RR vs PBKS Punjab Kings Won By 5 Wickets Against Rajasthan Royals​: పేలవ ప్రదర్శనతో అతి తక్కువ విజయాలతో మొదట ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన పంజాబ్‌ కింగ్స్‌కు భారీ ఊరట లభించింది. సామ్‌ కరాన్‌ గొప్ప పోరాటంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 15, 2024, 11:44 PM IST
IPL 2024 RR vs PBKS: సామ్‌ కరాన్‌ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో ఓటమి

IPL 2024 RR vs PBKS Live: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో మొదట ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకున్న పంజాబ్‌ కింగ్స్‌ గొప్ప పోరాటాన్ని ప్రదర్శించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఢీకొట్టి విజయం సాధించింది. సామ్‌ కరాన్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గౌహతి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

Also Read: IPL DC vs LSG: దుమ్మురేపిన పంత్‌ సేన.. విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పైకి.. లక్నో ఇంటికి 

హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టంగా రాజస్థాన్‌ 144 పరుగులకు పరిమితమైంది. రియాన్‌ పరాగ్‌ (48) మినహా మిగతా ఆటగాళ్లు అతి తక్కువ పరుగులు చేశారు. యశస్వి జైస్వాల్‌ (4), టామ్‌ కోహ్లెర్‌ కడమోర్‌ (18), కెప్టెన్‌ సంజూ శామ్‌సన్‌ (18) తక్కువ స్కోర్‌ చేయగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ (28) పర్వాలేదనిపించాడు. ధ్రువ్‌ జురేల్‌ డకౌట్‌ కాగా.. రవామన్‌ పావెల్‌ (4), ఫెర్రెరియా (7), ట్రెంట్‌ బౌల్ట్‌ (12), అవేశ్‌ ఖాన్‌ (3) కొంత పరుగులు చేశారు. రాజస్థాన్‌ను పరుగులు చేయకుండా పంజాబ్‌ బౌలర్లు చక్కగా నియంత్రించారు. వికెట్లు కూడా పడగొట్టారు. కెప్టెన్‌ సామ్‌ కరాన్‌, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, నాథన్‌ ఎల్లీస్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: IPL 2024 GT vs KKR: ఐపీఎల్‌కు వరుణుడి భారీ దెబ్బ.. వర్షంతో మ్యాచ్‌ రద్దు కోల్‌కత్తా టాప్‌లోకి.. గుజరాత్‌ ఇంటికి

అతి తక్కువ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ సామ్‌ కరాన్‌ గొప్ప పోరాటంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 18.5 ఓవర్లలో 5 frjuzhai కోల్పోయి 145 పరుగులు చేసింది. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన రంగంలోకి దిగిన సామ్‌ కరాన్‌ గ్రౌండ్‌లో నిలబడ్డాడు. 41 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రభ్‌షిమ్రాన్‌ సింగ్‌ (6), జానీ బెయిర్‌స్టో (14), రిలీ రూసో (22) తక్కువ పరుగులు చేయగా.. శశాంక్‌ సింగ్‌ డకౌట్‌ అయ్యాడు. జితేశ్‌ శర్మ (22), అశుతోష్‌ శర్మ (17) పరుగులు చేశారు. తక్కువ లక్ష్యాన్ని రాజస్థాన్‌ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. బ్యాటర్లు విఫలమైన వేళ బౌలర్లు పంజాబ్‌ను నియంత్రించలేకపోయారు. అవేశ్‌ ఖాన్‌, యజువేంద్ర చాహల్‌ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

స్వదేశానికి కరాన్‌
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కింగ్స్‌ కింది నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఓడినా కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరుకున్న రాజస్థాన్‌ వరుసగా నాలుగో ఓటమి చెందడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ సామ్‌ కరాన్‌ స్వదేశం వెళ్లాడు. ప్రపంచకప్‌లో స్వదేశం ఇంగ్లాండ్‌ తరఫున ఆడేందుకు కరాన్‌ తిరిగి వెళ్లాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News