అగ్రవర్ణాల రిజర్వేషన్లపై చంద్రబాబు రియాక్షన్

రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Last Updated : Jan 9, 2019, 10:18 AM IST
అగ్రవర్ణాల రిజర్వేషన్లపై చంద్రబాబు రియాక్షన్

కర్నులు: మోడీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లపై ఏపీ సీఎం చంద్రబాబు భిన్నంగా స్పందిచారు.  మంగళవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లు పై మాట్లాడుతూ ఈబీసీ బిల్లు విషయంలో అనుకులమా..వ్యవతిరేకమా అనే దానిపై స్పందించలేదు..ఈ విషయంలో మోడీ సర్కార్ తీరును మాత్రం ఆయన ఎండగట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నందువల్లే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. ఇది రాజకీయ లబ్ది కోసం తప్పితే పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కాదని విమర్శించారు. ఈ బిల్లుపై బీజేపీ సర్కార్ కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే..నాలుగేళ్లుగా ఏం చేసిందని.. ప్రశ్నించారు. 

ఇస్తే వారికీ రిజర్వేషన్లు ఇవ్వండి
వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, వెంటనే కేంద్రం వారికీ  రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. వాల్మీకులకు చేతి వృత్తులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం రూ.100 కోట్లు కేటాయించి త్వరలోనే ఆ నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. వాల్మీకి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి చదివించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు ఆ వర్గాలకు అభయమిచ్చారు

Trending News