Kuzhi Mandi Biryani: మహిళ ప్రాణం తీసిన 'కుజీ మండీ' బిర్యానీ.. 178 మందికి తీవ్ర అస్వస్థత

Kerala Woman Dies After Eating Kuzhi Mandi Biryani: కలుషిత ఆహారం కేరళలో తీవ్ర దుమారం రేపింది. తాజాగా కలుషిత బిర్యానీ తిని ఓ మహిళ మృతి చెందడం మరింత కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 28, 2024, 10:16 PM IST
Kuzhi Mandi Biryani: మహిళ ప్రాణం తీసిన 'కుజీ మండీ' బిర్యానీ.. 178 మందికి తీవ్ర అస్వస్థత

Kuzhi Mandi Biryani: కలుషిత ఆహార పదార్థం వలన మరో ప్రాణం పోయింది. గత నెలలో పాన్‌ తిని చిన్నారి మృతి చెందిన ఘటన మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. బిర్యానీ తిని ఓ మహిళా తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. కొన్ని రోజులు చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. అంతేకాకుండా ఆ బిర్యానీ తిన్న 178 మంది కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఆస్పత్రిలో చేరారు. ఈ దారుణ సంఘటన కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయంగా కూడా ఈ ఘటన వివాదాస్పదమైంది.

Also Read: Mandi Biryani: పెళ్లి రోజు చావుకొచ్చింది.. మండీ బిర్యానీ తిన్న కుటుంబం ఆస్పత్రిపాలు

 

త్రిసూర్‌ జిల్లాలోని పెరింజనం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌కు కుటిలక్కడవ్‌కు చెందిన మహిళ నుసైబా (56) వచ్చింది. అక్కడ ప్రత్యేకమైన కుజి మండీ బిర్యానీని ఆమె భుజించింది. ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సుసైబా మృతి చెందింది. అయితే అదే హోటల్‌లో తిన్న వారిలో 178 మంది కూడా అస్వస్థతకు గురయి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read: Woman Suicide: పెళ్లయి భర్తతో అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.. బావిలో దూకిన నవ వధువు

 

అయితే ఈ సంఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా హోటళ్ల నిర్వాహకులపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సంఘటన తీవ్ర వివాదం రేపింది. ఈ ఘటనపై మేల్కొన్న కేరళ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్‌లో కలుషిత ఆహారం వండారని తేలింది. రెస్టారెంట్‌లోని మయోనీస్‌ కలుషితమవడంతోనే అనారోగ్యానికి గురయ్యారని శాంపిల్‌లో తెలిసిపోయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News