How to Transfer Money from Credit Card to Bank Account: ఈరోజుల్లోనే కాదు మనం కష్టపడేది కేవలం డబ్బు కోసమే. క్రెడిట్ కార్డు ఈరోజుల్లో అందరూ వాడుతున్నారు. ఇది వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా క్రెడిట్ కార్డుతో ఈజీగా కొనుగోలు చేయవచ్చు. అయితే కొన్ని రకాల పేమెంట్స్ మాత్రం క్రెడిట్ కార్డుతో కావు. అంటే హోమ్ లోన్స్, కారు వంటివి క్రెడిట్ కార్డ్స్ తో అవ్వలేనివి. అయితే క్రెడిట్ కార్డ్ నుంచి త్వరగా సేవింగ్ అకౌంట్ లోకి మార్చుకోవాలంటే ఎక్కువగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు తో మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు ఎలా జమా చేసుకోవచ్చు తెలుసుకుందాం.
ఇ వ్యాలెట్..
క్రెడిట్ కార్డ్ నుంచి మీ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలోకి డబ్బు ట్రాన్స్ఫర్ కావాలంటే కొన్ని రకాల ఇ వ్యాలెట్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్రీఛార్జ్, మోబీక్విక్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ముందుగా ఇ వ్యాలెట్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి.
ఆ తర్వాత ఈ వ్యాలెట్ అప్లికేషన్లో పాస్ బుక్ సెక్షన్ ఓపెన్ చేయండి.
అక్కడ మీకు 'సెండ్ మనీ టు బ్యాంక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
'ట్రాన్స్ఫర్' ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఎంత డబ్బు మీరు ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నారు టైప్ చేయండి. ఇందులో బెనిఫిషీయరీ అకౌంటు ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ కూడా ఉండాలి. చివరగా 'సెండ్ బటన్' క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమా అయిపోతుంది.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఈ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తుంది త్వరపడండి..
నెట్ బ్యాంకింగ్..
నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
మీ సంబంధిత బ్యాంకు వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
అందులో మీకు లాగిన్ క్రెడెన్షియల్ ద్వారా క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అప్పుడు 'ట్రాన్స్ఫర్' ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో టైప్ చేయాలి .ఇందులో మీకు ఖాతాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
ఆన్లైన్లో కాకుండా కొన్ని రకాల ఆఫ్ లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో క్రెడిట్ కార్డ్ నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాకు డబ్బును సులభంగా మార్చుకోవచ్చు. వెంటనే డబ్బు అవసరం ఉంటే ఫోన్ కాల్ ద్వారా కూడా వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి వారు నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు.
ఇదీ చదవండి: ఏయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్.. రూ. 1,177 కే విమాన ప్రయాణం..త్వరపడండి..
ఫోన్ కాల్..
మీ క్రెడిట్ కార్డు కంపెనీకి ఫోన్ కాల్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ ని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీకు ఎంత ఫన్ ట్రాన్స్ఫర్ కావాలో కన్ఫర్మ్ చేసుకొని మీ అకౌంట్ డీటెయిల్స్ అందులో నమోదు చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమా అయిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి