Lok Sabha Election Results in Theatres Maharashtra: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి గురించి మాత్రమే చర్చించుకుంటున్నారు. ఇంట్లో, బస్టాండ్ లలో.. ఈ పార్టీకి అన్ని సీట్లు వస్తాయి.. ఆ పార్టీనే భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చర్చలు జరుపుకుంటున్నారు. ఈ చర్చలలో.. అన్ని వయసుల వారు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. శనివారం చివరి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే.. ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసే ఆయా సంస్థలు ఎప్పుడు సాయంత్రం 6.30 అవుతుందా అని వేచీచూస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా తమ భవితవ్యంను ఎగ్జిట్ పోల్స్ ఏవిధంగా అంచనా వేస్తుందో అని టెన్షన్ తో ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈసారి జూన్ 4 న విడుదలయ్యే ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్ లలో చూడోచ్చు. దీని కోసం అనేక థియేటర్లు ముందుకు వచ్చాయి. ఇప్పటికే అనేక థియేటర్లలో బుక్కింగ్స్ అయిపోవడానికి వచ్చాయని కూడా తెలుస్తోంది.
ముఖ్యంగా.. మహరాష్ట్ర ముంబైలోని ఎస్‌ఎం5 కల్యాణ్, సియాన్.. కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్ థియేటర్లు.. థానేని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్‌లు వీటిలో ఉన్నాయి. అదే విధంగా.. పూణెలోని మూవీమ్యాక్స్, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ తదితర థియేటర్లు బిగ్ స్క్రీన్ మీద మూవీ చూడడానికి ఈ అవకాశాన్ని కల్పించాయి. ఈ క్రమంలో.. జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పేటీఎం వంటి ప్లాట్‌ఫామ్‌లలో బుకింగ్స్‌ను స్టార్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
Read more: PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..
ఇక దేశంలో జూన్ 4 వెలువడే ఫలితాల కోసం దేశంలో మొబైల్ ఫోన్‌లు, టీవీలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు థియేటర్లకు కూడా జనాలు క్యూలు కడతారన్న మాట. ఈ రిజల్ట్స్ కోసం టికెట్ ధరలను రూ. 99 నుంచి రూ.300 వరకు ఉన్నాయని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో టికెట్లన్ని అమ్ముడుపోయి హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం.. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter