Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా పలు సర్వే సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దుమ్ము దులిపింది. సర్వేలు చెప్పినట్టుగా దేశ వ్యాప్తంగా బీజేపీ హవా వీచలేదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉండటంతో ఉన్న ప్రజా వ్యతిరేకత ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యక్తమైంది. అక్కడ కొన్ని సీట్లు కోల్పోయింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఉత్తరాదిలో కోల్పోయిన సీట్లును తెలుగు రాష్ట్రాల్లో భర్తీ చేసుకున్నారు. ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండోసారి ఈ లోక్ సభ స్థానం నుంచి ప్రత్యర్ధులను చిత్తు చిత్తు చేసి విజయ కేతనం ఎగరేసారు. 2024 ఎన్నికల్లో బండి సంజయ్.. తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెలచాలా రాజేందర్ రావు పై 2,25,209 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బండి సంజయ్ .. ఆరు నెలలు తిరగ్గాండానే లోక్ సభకు ఎన్నికయ్యారు. గత లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ కూడా బండి సంజయ్.. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తన సమీప TRS అభ్యర్ధి బోయనపల్లి వినోద్ కుమార్ పై దాదాపు 89,508 మెజారిటీతో గెలుపొందారు.
2019 ఎన్నికల్లో బీజేపికి అక్కడ 4,98,276 ఓట్లు పడ్డాయి. అంతేకాదు మొత్తం నియోజకవర్గంలో 43.42 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే 24.34 శాతం అధికంగా ఓట్లు పడ్డాయి. మరోవైపు ఆయన సమీప ప్రత్యర్ధి టీఆర్ఎస్ నేత బోయనపల్లి వినోద్ కుమార్ కు 4,08,768 ఓట్లు పోలయ్యాయి. 35.62 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే 9.31 శాతం తక్కువగా ఓట్లు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు 1,79,258 ఓట్లు పోలయ్యాయి. 15.62 శాతం ఓట్లు పడ్డాయి. గతంలో కంటే 11.09 శాతం తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదు అయింది. ఇక నోటాకు 7,979 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో 0.19 శాతం పడ్డాయి.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్, చొప్పదండి (SC), వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు (SC), హూజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలిపి 22 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ సీటును గెలుచుకుంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత ఈ సీటు నుంచి రెండు ఉప ఎన్నికలతో కలిసి మూడుసార్లు ఈ స్థానం నుంచి గెలిచారు. బీజేపీ ఈ సీటులో 1988, 1999, 2019, తాజాగా 2024లో మొత్తంగా నాలుగు సార్లు ఈ సీటు నుంచి గెలుపొందడటం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook