Nani: మరొక డైరెక్టర్ తో నాని సినిమా ఫట్.. నిరాశలో ఫ్యాన్స్..

Saripodhaa Sanivaram: నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం.. సరిపోదా శనివారం.. సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత.. నాని రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. కానీ వేరే కారణాలవల్ల.. ఈ రెండు సినిమాలు హోల్డ్ లోకి వెళ్లిపోవడంతో..అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 17, 2024, 05:05 PM IST
Nani: మరొక డైరెక్టర్ తో నాని సినిమా ఫట్.. నిరాశలో ఫ్యాన్స్..

Saripodhaa Sanivaaram Release Date: 2023లో నేచురల్ స్టార్ నాని హీరోగా.. నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. దసరాతో సూపర్ హిట్.. అందుకున్న నాని హాయ్ నాన్న సినిమాతో.. కూడా మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇప్పుడు.. సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నారు. 

అంటే సుందరానికి సినిమాకి దర్శకత్వం వహించిన..వివేక్ ఆత్రేయ..ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో.. రొమాన్స్ చేసిన.. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.. కానీ నాని మరొక రెండు సినిమాలను.. లైన్ లో పెట్టారు. అయితే.. దురదృష్టవశాత్తు..ఈ రెండు సినిమాలు ఆటకెక్కేసాయి.

వివరాల్లోకి వెళితే దసరా సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓడల.. దర్శకత్వంలో నాని మరొక సినిమాని సైన్ చేశారు. డీవీవీ దానయ్య.. ఈ సినిమాకి నిర్మాత. కానీ బడ్జెట్ కారణాల వల్ల.. ఈ సినిమా మొదలవ్వకుండానే ఆగిపోయింది. ఈ సినిమా ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. 

ఇది ఇలా ఉండగా.. నాని బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో.. కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధం అయ్యారు. అంతా ఓకే అనుకుంటున్నా సమయంలో.. ఈ సినిమా కథ విషయంలో గొడవ మొదలైంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పిన కథ, ఇప్పుడు బలగం వేణు చెప్పిన కథ రెండు దాదాపు.. ఒకేలాగా ఉండటంతో ఈ సినిమా కూడా ఇప్పుడు హోల్డ్ లోకి వెళ్లిపోయింది. 

ప్రస్తుతం అనుకున్న కథ.. అయితే క్యాన్సిల్ అయిపోయినట్టే. కానీ నాని, వేణు, దిల్ రాజు కాంబోలో సినిమా.. అయితే ఇంకా పూర్తిగా క్యాన్సిల్ కాలేదు. ఒకవేళ డైరెక్టర్ వేణు.. మరొక కథతో నాని ని మెప్పించగలిగితే.. సినిమా మళ్లీ ఓకే అవుతుందేమో. బలగం వంటి చిన్న బడ్జెట్ సినిమాతో.. సూపర్ హిట్ అందించిన జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో నానిని చూడాలని అభిమానులు కూడా ఎదురుచూశారు. కానీ అందులోనే ఇలా జరిగింది.

ప్రస్తుతానికి అయితే నాని సైన్ చేసిన రెండు సినిమాలు హోల్డ్ లోనే.. ఉండడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు సరిపోదా శనివారం తప్ప నాని చేతిలో మరే సినిమా లేదు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న.. థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమా కాకుండా.. నాని మళ్లీ ఇంకా ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.

Read more; Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News