Chiranjeevi Vishwambhara: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. తమిళ్లో మాత్రమే కాక.. తెలుగులో కూడా విజయ్ సేతుపతి సినిమాలకి.. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వయసుకు తగ్గ పాత్రలు.. చేయడంలో విజయ్ సేతుపతి.. తర్వాతే ఎవరైనా. తాజాగా మహారాజా సినిమాతో విజయ్ సేతుపతి మరొకసారి.. ఈ విషయాన్ని నిరూపించారు.
ఎంత పెద్ద స్టార్ హీరో.. అయినప్పటికీ విజయ్ సేతుపతి సినిమాలు రియాలిటీకి.. చాలా దగ్గరగా ఉండటం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ మధ్యనే విడుదలైన మహారాజా.. సినిమా కూడా దీనికి పరాకాష్ట. సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్.. కూడా చాలా మామూలుగా ఉంటుంది. సినిమాలో కూడా విజయ్ సేతుపతి.. తన వయసుకి తగ్గ పాత్రలోనే కనిపించారు. సినిమా కథ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అద్భుతమైన కథ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే స్క్రీన్ ప్లే..విజయ్ సేతుపతి నటన ఇవన్నీ మహారాజా సినిమాని బ్లాక్ బస్టర్ గా.. నిలిపాయి. సినిమా సంగతి ఇలా ఉంటే.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి సినిమాలు ఎందుకు చేయడం లేదు.. అని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్.. ఏ మాత్రం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఎంతసేపు వింటేజ్ చిరంజీవిని చూపించాలని. ప్రయత్నిస్తూ డైరెక్టర్లు కథ.. గురించి పట్టించుకోవడం లేదు. కానీ మహారాజా వంటి.. మంచి కథ స్క్రీన్ ప్లే ఉన్న.. సినిమాలలో చిరంజీవి ఇంకా బాగా సూట్ అవుతారు. మరి చిరంజీవి అలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదు.. అని చర్చ మొదలైంది.
విజయ్ సేతుపతి మాత్రమే కాదు మలయాళం లో మోహన్ లాల్ నేరు వంటి సినిమాలో నటించారు. మమ్ముట్టి కూడా కథల్ వంటి సినిమాలో కనిపించారు. ఇవి కూడా కంటెంట్ మీద మాత్రమే.. ఆధారపడి వచ్చిన సినిమాలు. తెలుగులో కూడా చిరంజీవి ఇలాంటి సినిమాలు.. చేస్తే కొన్ని వర్గాల ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తారు. కమర్షియల్ టెంప్లేట్ దాటి చిరంజీవి సినిమాలు చేయాలని, ఎక్స్పరిమెంట్ సినిమాలలో చిరంజీవిని చూడాలని అభిమానులు సైతం ఆశపడుతున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటిదాకా చిరంజీవి టచ్ చేయని జోనర్ ఇది. దీంతో సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఒకవేళ హిట్ అయితే మాత్రం ఆ తరువాత చిరంజీవి రొటీన్ సినిమాలకి దూరమై, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter