విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ  రిలీజ్ డేట్ ఫిక్స్ 

                                                    

Last Updated : Mar 4, 2019, 11:41 AM IST
విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ  రిలీజ్ డేట్ ఫిక్స్ 

తెలుగు తెరపై వరస హిట్స్ తో దూసుకెళ్లున్న హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… భరత్ కమ్మ అనే కొత్త దర్శకత్వంలో జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది

వాస్తవానికి ఈ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే  ఈ నెలలో సూపర్ స్టార్  మహేష్ తో పాటు నాగ చైతన్య , నాని  బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘డియర్ కామ్రేడ్’ తో మేలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. కాగా ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా మే 25న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. కాస్త లేటు అయినప్పటికీ లెటెస్ట్ గా కలిపించాలనేదే విజయ్ దేవరకొండ స్టాటజీ. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన సింగిల్ కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

Trending News