YS Jagan Letter to Speaker Ayyanna Patrudu: ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగిందన్నారు. అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ్వీకారం చేయాలి.. కానీ అలా జరగలేదని గుర్తు చేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే తరువాత ప్రమాణం చేయించారని.. తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారని లేఖలో పేర్కొన్నారు.
Also Read: Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..
విపక్షంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో విపక్షంలో వైసీపీ మాత్రమే ఉందన్నారు. గౌరవ స్పీకర్ మాట్లాడిన మాటలు యూట్యూబ్‌లో పబ్లిష్ అయ్యాయనని.. ఓడిపోయాడు కాని చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలంంటూ తనను ఉద్దేశించి అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయన్నారు. తనపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లను సాధించిందని.. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే.. అసెంబ్లీ కార్యకలాపాల్లో కట్టడిచేస్తున్నట్లే అవుతుందని జగన్ అన్నారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు తగిన సమయం లభిస్తుందన్నారు. అసెంబ్లీ సీట్లలో 10 శాతం సీట్లు రానందున వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోందని.. అయితే సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదన్నారు. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో 543 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుందని, 10 శాతం సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేవలం 3 సీట్లు గెలుచుకున్నా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తాను సభలో మాట్లాడాలనుకుంటే.. భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద.. తనను చచ్చేవరకు కొట్టాలన్న స్పీకర్ విచక్షణమీదే ఆధారపడి ఉంటుందన్నారు. సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని మాజీ సీఎం జగన్ కోరారు.
Also Read: Sexual Assault: పోర్న్ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter