Kannappa Teaser Views: మంచు విష్ణు హీరోగా.. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పైన నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ.. ఈనెల 14న ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వాళ్లకి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఈ టీజర్ లో చూపించాడు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళీ హీరో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్.. వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించింది. ముఖ్యంగా హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, విష్ణు మంచు యాక్షన్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్.. ప్రేక్షకులను ఈ టీజర్ లో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా రానున్న కన్నప్ప టీజర్ ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే..ఈ చిత్రం టీజర్.. కేవలం తెలుగులోనే దాదాపు 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టిస్తోంది. అలాగే తాజాగా అన్ని భాషల్లోనూ కలిపి కన్నప్ప టీజర్.. ఏకంగా 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ త్వరలోనే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు
Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter