Team India Head Coach: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపిక కావడం లాంఛనంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పొట్టి కప్ తరువాత ముగియనుంది. మరోసారి కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కోచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ ఇంటర్వ్యూలు నిర్వహించింది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే కొత్త కోచ్ పేరును ప్రకటించనుంది. గౌతమ్ గంభీర్ ఎంపిక పూర్తయిందని బీసీసీ వర్గాల నుచి సమాచారం. గంభీర్ కోచ్‌గా రాకతో భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లను మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్.. ఆ పదవికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది.
Also Read: సౌత్ ఇండియా హీరోయిన్స్ పై కన్నేసిన బాలీవుడ్ హీరో.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో!
డిసెంబర్ 2021లో జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఇండియా అండర్-19, ఇండియా ఎ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాదు రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో టీమిండియాకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ద్రావిడ్ వారసుడిగా లక్ష్మణ్ పేరును ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే లక్ష్మణ్ కోచ్ పదవిని తిరస్కరించారు. 2021లో భారత జట్టు హెడ్ కోచ్‌గా రావాలని లక్ష్మణ్ అనుకున్నారు. అయితే ఆయన ఎన్సీఏ చైర్మన్ పదవి ఇచ్చి.. రాహుల్ ద్రావిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేశారు.
2019 నుంచి 2021 వరకు జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్ రాహుల్ ద్రావిడ్ పని చేసిన విషయం తెలిసిందే. వీవీఎస్ లక్ష్మణ్ 2013 నుంచి 2021 వరకు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా పనిచేశారు. ఆ తరువాత బీసీసీఐలో చేరారు. ఎన్సీఏ అధ్యక్షుడిగా లక్ష్మణ పదవీకాలం 2024లో ముగియనుంది. దీంతో తిరిగి మళ్లీ ఐపీఎల్లో లక్ష్మణ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రోఫీని గెలవడంలో మెంటర్‌గా గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేశాడు. అంతకుముందు లక్నో టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శ్రీలంక టూర్‌తో టీమిండియా కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వరల్డ్ ముగిసిన వెంటనే భారత్ జింబాబ్వే టూర్‌కు వెళ్లనుంది. ఈ టూర్ వరకు లక్ష్మణ్ కోచ్ వ్యవహరిస్తారని అంటున్నారు.
Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి