Lakshmi Narayan Yoga 2024: జూలై 7వ తేది నుంచి ఈ 3 రాశులవారి తల రాతలు మారబోతున్నాయ్‌.. ఇక డబ్బే డబ్బు!

Lakshmi Narayan Yoga 2024: ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 28, 2024, 10:55 AM IST
Lakshmi Narayan Yoga 2024: జూలై 7వ తేది నుంచి ఈ 3 రాశులవారి తల రాతలు మారబోతున్నాయ్‌.. ఇక డబ్బే డబ్బు!

Lakshmi Narayan Yoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు కొంత సమయం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశికి లేదా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సార్లు ఒక రాశిలో రెండు గ్రహాలు కూడా సంచారం చేస్తాయి. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో సంయోగం అని అంటారు. అయితే ఇలా సంయోగం జరిగినప్పుడు ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య, శుక్రాదిత్య, ధన లక్ష్మి యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలన్నింటినీ రాజయోగాలు కూడా పిలుస్తారు. జన్మ జాతకంలో ఈ యోగాలు శుభస్థానంలో ఉంటే జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో కష్టాలన్నీ ఎంతో సులభంగా తొలగిపోతాయి. 

ఇదిలా ఉంటే జూన్ 29 బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అంతేకాకుండా ఈ గ్రహ సంచారం జరిగిన 8 రోజులకే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇలా ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా కూడా ఉంటుంది. అలాగే జన్మ జాతకంలో ఈ యోగం శుభస్థానంలో ఉంటే ఆర్థిక సమస్యల నుంచి కూడా ఎంతో సులభంగా విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

కర్కాటక రాశి:
ఈ శక్తివంతమైన యోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఎంతో తొందరగా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. దీంతో పాటు కలలు కూడా నెరవేరే ఛాన్స్‌ ఉంది. అలాగే సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు సంబంధాలు కూడా ఎంతో వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా అన్నదమ్ములతో సత్సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. 

తులారాశి:
లక్ష్మీనారాయణ యోగ ప్రభావం తులా రాశివారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా తులారాశికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనున్న పనులు కూడా ఎంతో తొందరగా జరుగుతాయి. అలాగే ఈ సమయంలో అన్ని కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా సంపదన కూడా రెట్టింపు అవుతుంది. కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో వస్తున్న ఎలాంటి అడ్డంకులైనా సులభంగా తొలగిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా వీరికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించి అనుకున్న ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:
 బుధుడు, శుక్రుడి సంచారం కారణంగా ఏర్పడే ఈ యోగ ప్రభావం వృశ్చిక రాశివారిపై కూడా సమానంగా పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక పరమైన సమస్యల నుంచి పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం, హూదా కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఊహించని లాభాలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News