Kalki 2898 AD Hindi Collections: బాహుబలి సినిమాలతో ప్రభాస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొన్ని చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోయినా.. హీరోగా రెబల్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు హిందీలో ఆరు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన దక్షిణాది హీరో ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ పార్ట్ -1, తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ హిందీలో రూ. 100 కోట్ల నెట్ క్లబ్ లో ప్రవేశించింది.
అంతేకాదు వరుసగా మూడేసి చిత్రాలు చొప్పున మధ్యలో ‘రాధే శ్యామ్’ మినహా ప్రభాస్ నటించిన అన్ని చిత్రాలు హిందీ బెల్ట్ లో మంచి వసూళ్లనే రాబట్టాయి. అంతేకాదు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను మన దేశంలో రాబట్టిన చిత్రాలు ప్రభాస్ వి ఆరు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోకున్నా.. సలార్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు తాజాగా కల్కి మూవీతో తన స్టార్ వపర్ ఎలాంటిదో చూపించాడు.
సంవత్సారినిక మూడు సినిమాలతో మీ ముందుకు వస్తానని ప్రభాస్ అభిమానులకు మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ సలార్ తర్వాత ఆరు నెలల్లోనే కల్కి మూవీతో పలకరించాడు. స్టార్ గా ప్రభాస్ లోని డెడికేషన్ కు ఇది నిదర్శనం. ప్రభాస్ వరుసగా సినిమాలు చేయడం అభిమానులకే కాదు చిత్ర పరిశ్రమలోనూ వేలాది మందికి ఉపాధి కలిగిస్తుంది. అందుకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ నిరంతరం కష్టపడుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్.
క్రేజీ పాన్ ఇండియా మూవీస్ తో భారీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘ రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. అటు ప్రశాంత్ నీల్ తో త్వరలోనే సలార్ 2 ప్రారంభించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అటు కన్నప్ప మూవీలో పరమశివుడిగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే కల్కి సీక్వెల్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ కంప్లీటైంది. ఇలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రెస్ట్ లెస్ గా తన షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ ప్రభాస్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరిస్తూ స్టార్ గా ఆయనను మరింత ఎత్తుకు తీసుకెళాతాయనడంలో సందేహం లేదు.
Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter.