BRS ex minister talasani Srinivas Yadav party jump rumours on social media: తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ గా మారిపోతున్నాయి. ఇప్పటికే.. బీఆర్ఎస్ ను వరుస కష్టాలు కుదేలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే.. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారడం పట్ల గులాబీబాస్ , పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యారంట. కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్ లోకి చేరడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ చేరికలపై బహిరంగంగానే విమర్శలు చేశారు.
Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
ఒకానోక సందర్భంలో.. ఆయన ఏకంగా ఎమ్మెల్సీకి రాజీనామా సైతం చేస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దీనిపై ప్రస్తుతం ఇంకా బుజ్జగింపులు నడుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో కొన్నిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అనేక మంది సీనియర్ నేతలంతా హస్తినలోనే మకాం వేశారు. అంతేకాకుండా.. కెబినెట్ విస్తరణ కూడా ఉంటుందని కూడా వార్తలపై జోరుగా ప్రచారం నడుస్తోంది. పోచారంకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
మరోవైపు తెలంగాణకు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికపైన కూడా కొంత మంది నేతల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతున్నరన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఢిల్లీ లెవల్ కూడా మంత్రాగం నడుస్తున్నట్లు సమాచారం. అదే విధంగా.. గతంలో రేవంత్, తలసాని టీడీపీలో ఉండగా పనిచేశారు. కానీ ఇటీవల మాత్రం పక్కా.. వ్యతిరేకమైన పార్టీలలో ఉండటం వల్ల పలు మార్లు విమర్శలు సైతం గుప్పించుకున్నారు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని పార్టీ మారుతారి, కాంగ్రెస్ లోకి చేరతారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏకంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం రంగంలోకి దిగి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ తో రాయబారం చేస్తున్నారంట. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా.. తలసానికి మంత్రి బెర్త్ కూడా కన్ఫామ్ అయిపోయిందని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు కాలం చేసిన విషయం తెలిసిందే. ఈ పుకార్లపై మాత్రం.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి