Prabhas: ఆ హీరోయిన్ కి టికెట్ బుక్ చేసి మరి సినిమాకి పంపిన ప్రభాస్.. ఇంతకీ ఎవరంటే!

Celebrities about Prabhas: ప్రభాస్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతో ముద్దుగా డార్లింగ్.. అంటారు. అందుకు ముఖ్య కారణం ఆయన ప్రవర్తన తీరు. ఆయన ప్రవర్తన తీరు గురించి.. ఎంతోమంది సెలబ్రిటీస్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ప్రభాస్ గురించి.. చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటున్నాయి.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 2, 2024, 11:00 PM IST
Prabhas: ఆ హీరోయిన్ కి టికెట్ బుక్ చేసి మరి సినిమాకి పంపిన ప్రభాస్.. ఇంతకీ ఎవరంటే!

Hamsa Nandini about Prabhas: డార్లింగ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆయన మంచితనం వల్లే.. ఆయనకు ఆ పేరు సొంతమయింది. ఎవరినైనా సరే తన సొంత మనిషిలా ట్రీట్ చేస్తారు ప్రభాస్. ఇదే విషయం ఎన్నోసార్లు ఎంతోమంది సెలబ్రెటీస్.. చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి..ఒక హీరోయిన్ చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకుంది. 

ప్రభాస్ తో హంస నందిని.. మిర్చి సినిమాలో.. మిర్చి మిర్చి లాంటి కుర్రాడు పాతలో కనిపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పాట మంచి విజయం.. సాధించింది. అనుమానస్పదం.. సినిమాతో హీరోయిన్గా పరిచయమైన హంస నందిని.. ఆ తరువాత కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసింది. ఆ ఐటెం సాంగ్స్ లో మిర్చి సాంగ్ ఆమెకు మంచి పేరు.. తెచ్చి పెట్టింది. కాగా ఈ హీరోయిన్ ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

 

‘ప్రభాస్‌కి చాలా సిగ్గు. మిర్చి సినిమా తర్వాత.. నేను ప్రభాస్ గారిని ఒక పార్టీలో కలిసా. మిర్చి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను.. ఆ చిత్త ప్రమోషన్స్ లో ఎప్పుడూ పాల్గొనలేదు. విడుదల సమయం కూడా వేరే ప్రాజెక్టుల వల్ల బిజీగా ఉన్నాను. ఇక మిర్చి సినిమా మంచి విజయం సాధించిన తరువాత.. వేరే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడే ప్రభాస్‌ను పార్టీలో కలిశాను.నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా అని ప్రభాస్ అప్పుడు నన్ను అడిగాడు. లేదు నేను సినిమా కూడా ఇంకా చూడలేదు అని చెప్పుకొచ్చాను. అంతే ప్రభాస్ వెంటనే దగ్గరలోని థియేటర్లో మిర్చి సినిమా.. టికెట్ బుక్ చేసి.. వెళ్లి చూడమని చెప్పాడు. పైగా సినిమాలో నా సాంగ్ ఎప్పుడొస్తుందో అని నాకు.. టైమ్ కూడా చెప్పాడు. దీంతో ఆ సాంగ్ వచ్చిన సమయంలో థియేటర్‌కి వెళ్లి చూశాను. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్" అంటూ హంస నందిని చెప్పింది.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News