Honda Freed 7 Seater: హోండా కంపెనీ ఎస్‌యూవీకు ఇండియాతో పాటు విదేశాల్లో కూడా బలమైన మార్కెట్ ఉంది. హోండా ఎలివేట్ అంతగా సక్సెస్ అయింది. హోండా కంపెనీ కార్లలో బెస్ట్ సెల్లింగ్ ఇదే. ఇప్పుుడు ఎంపీవీ విభాగంలో కొత్త కారును లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి జపాన్‌లో లాంచ్ అయిన ఈ కారు త్వరలో భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది.
ఎస్‌యూవీ, సెడాన్ విభాగంలో బలంగా ఉన్న హోండా కంపెనీ ఎంపీవీ 7 సీటర్ విభాగంలో అడుగుపెట్టింది. కొత్తగా 7 సీటర్ కారును జపాన్ మార్కెట్‌లో హోండా ఫ్రీడ్ ఎంపీవీ లాంచ్ చేసింది. ఈ కారు మైలేజ్ పరంగా అత్యధికంగా 25 కిలోమీటర్లు ఇస్తుండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. హోండా ఫ్రీడ్ ఎంపీవీ రెండు పవర్ ట్రెయిన్ వేరియంట్ల కలిగి ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఒకటైతే 1.5 లీటర్ పెట్రోల్ అండ్ హైబ్రిడ్ మోడల్ కారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ అయితే 6600 ఆర్పీఎంతో 118 పీఎస్ పవర్, 142 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక హోండా ఫ్రీడ్ 1.5 లీటర్ పెట్రోల్ విత్ డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ ఇంజన్ అయితే 48 ఏహెచ్ లిథియం ఐరన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆ కారు 123 పీఎస్ పవర్, 253 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యంతో ఉంటుంది.
హోండా ఫ్రీడ్ హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్ అయితే 25 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంటే పెట్రోల్ వెర్షన్ 16.2 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది. ఇందులో 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక ఈ కారులో అటానమస్ ఎమర్జన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేక్ కీప్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అది కాకుండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్యాబ్రిక్ ట్రీమ్ అండ్ రీ పొజిషన్డ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అన్నింటికంటే ప్రత్యేకంగా ఇందులో వికలాంగుల కోసం వీల్ ఛైర్ ర్యాంప్ ఉంటుంది.
హోండా ఫ్రీడ్ ఎంపీవీ కారు పొడవు 4310 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1720 మిల్లీమీటర్లుగా ఉంది. ఇక ఎత్తు 1780 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ కారు ధర జపాన్‌లో 13 లక్షల నుంచి 17 లక్షల మధ్యలో ఉంది. త్వరలో భారతీయ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇండియాలో అయితే హోండా ఫ్రీడ్ ఎంపీవీ కారు మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ , మహీంద్రా మరాజోలతో పోటీ పడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook