Revanth Reddy: యువత కోసం రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Skill University At Engineering Staff College Gachibowli: తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత నైపుణ్యాలు పెంపొందించడానికి స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 8, 2024, 05:00 PM IST
Revanth Reddy: యువత కోసం రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Telangana Skill University: నైపుణ్యాల కొరత వేధిస్తుండడతో యువత కోసం రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తగిన ప్రణాళిక రూపొందించాలని వివిధ పారిశ్రామిక వర్గాలకు ఆదేశించింది. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే  స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రతిపాదనలు పంపిస్తే ఒక రోజుల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Also Read: Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు.. ఎందుకంటే?

 

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నైపుణ్య అభివృద్ధిపై సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులతో కలిసి రేవంత్‌ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు అందుబాటులో ఉండడంతో ఈ సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని చెప్పారు.

Also Read: RTC Bus Deliver: డాక్టర్‌లా మారిన కండక్టర్.. ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి పుట్టింది

 

స్కిల్ యూనివర్సిటీలో ఏయే కోర్సులు, ఎలాంటి కరిక్యులమ్ ఉండాలి వంటి వాటిపై ప్రభుత్వంతోపాటు పారిశ్రామిక రంగ నిపుణులతో చర్చించారు. పరిశ్రమల అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు. సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. కాగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు అంశమనేది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చర్యలు తీసుకున్నారు. చర్చల దశలో ఉన్న ఆ యూనివర్సిటీని తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News