జయలలిత బయోపిక్‌లో కంగనా రనౌత్

జయలలిత బయోపిక్‌లో కంగనా రనౌత్

Last Updated : Mar 23, 2019, 03:20 PM IST
జయలలిత బయోపిక్‌లో కంగనా రనౌత్

కంగనా రనౌత్ తన తర్వాతి సినిమాలో ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ఝాన్సీ రాణి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమాతో చివరిసారిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన కంగనా రనౌత్ ఈరోజు తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత యదార్థగాథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్ సినిమాలో తాను జయలలిత పాత్ర పోషించనున్నట్టు కంగనా రనౌత్ స్పష్టంచేసింది. మద్రాసపట్టిణం, దైవ తిరుమగల్ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేయనున్నాడు.

తమిళంలో తళైవి, హిందీలో జయ అనే టైటిల్స్‌తో తెరకెక్కనున్న జయలలిత బయోపిక్‌కు ప్రముఖ కథా రచయిత కేవి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రూపొందించనున్నారు. విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

Trending News