martyr Anshuman singh wife smriti singh trolling incident: సోషల్ మీడియాలో వికృత చేష్టలకు అడ్డు అదుపులేకుండా పోయింది. అమ్మాయిలు, మహిళలే టార్గెట్ గా.. కొందరు కేటుగాళ్లు ఇటీవల ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు. అందంగా లేవని, పొట్టిగా ఉన్నావని, మొటిమలు ఉన్నాయని కూడా బాడీషేమింగ్ లకు పాల్పడుతున్నారు. కనీసం ముఖ పరిచయంలేని వారిసైతం.. సోషల్ మీడియాలో దారుణాంగా ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు.సెలబ్రీటిలను సైతం, యాక్టర్ లను సైతం వీరి వదలట్లేదు. ఇష్టమున్నట్లు ఆన్ లైన్ వేదికగా నీచపు భాషను ఉపయోగించి, దారుణంగా ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు. కొందరు ఈ ట్రోలింగ్ భూతానికి తట్టుకోలేక సూసైడ్ లు సైతం చేసుకుంటున్నారు. మరికొందరు తమ సోషల్ మీడియా అకౌంట్ లను సైతం.. బంద్ చేసుకుంటున్నారు.
"It was love at first sight," recalled Smriti Singh - the wife of late Captain Anshuman Singh who was awarded Kirti Chakra posthumously for the ultimate sacrifice in saving the life of his fellow army men from a fire at Siachen. Om Shanti Captain Anshuman Singh ❤️🙏 pic.twitter.com/XO8ppm0KeV
— Sumit (@SumitHansd) July 7, 2024
ఈ క్రమంలో ఇప్పటికే ఈ ట్రోలింగ్ ల వల్ల ఎందరో సున్నిత మనస్కులు తమ ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇటీవల ఒక తల్లి తన చేతిలో నుంచి పొరపాటున బాల్కనీలో నుంచి కిందకు పడిపోయింది. పక్కనున్న వారు చాకచక్యంగా వ్యవహరించి ఆ బిడ్డను కాపాడారు. కానీ ఈ ఘటన వైరల్ కావడంతో ఆ తల్లిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.బిడ్డను చూసుకొవడం చాతకాదా.. అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో ఆ కన్న తల్ల పాపం దెబ్బకు సూసైడ్ చేసుకుంది. ఆ చిన్నారి మాత్రం అనాథలా మారిపోయింది. ఈ క్రమంలో ఇటీవల దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతసైనికులడు అంశుమాన్ సింగ్ త్యాగానికి గుర్తుగా కేంద్రం.. కీర్తిచక్ర అవార్డును ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా అంశుమాన్ సతీమణి..స్మృతి అవార్డును తీసుకొవడానికి వచ్చారు. ఆమె తన భర్తను తలచుకుంటూ, ముఖంలో ఎలాంటి హవభావాలు లేకుండా, బరువెక్కిన మనస్సుతో ఆ అవార్డును స్వీకరించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. సదరు మహిళ ఎంతో అందంగా ఉందని, ఆమె అందానికి ఫిదా అవుతున్నానంటూ ట్రోల్స్ చేశారు. ఒక నీచుడైతే.. ఏకంగా.. ఈమెను వదిలేది లేదంటూ.. అసహ్యకరమైన కామెంట్లు పెట్టాడు. ఈ ఘటనపై దేశంలో తీవ్ర దుమారం చెలరేగింది.
దీనిపై జాతీయ మహిళ కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. నిందితుడిని కఠినంగా పనిష్ చేయాలంటూ కూడా పోలీసులను ఆదేశించింది. ఈ నీచపు వ్యాఖ్యలకు పాల్పడింది ఢిల్లీకి చెందిన అహ్మద్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదుచేశారు. దీనిపై తమకు నివేదిక ఇవ్వాలని కూడా నేషనల్ మహిళ కమిషన్ పోలీసులకు ఆదేశించింది.
Read more: Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
ఇదిలా ఉండగా.. 26 బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్ కు చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్ గతేడాది జులై 19న విధినిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. సియాచీన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తోటి వారిని కాపాడే క్రమంలో.. అంశుమాన్ తీవ్ర గాయాలపాలై మరణించాడు. అతని ధైర్యసాహాసాలకు గుర్తుగా కేంద్రం కీర్తిచక్ర ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి