Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..

Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. మొత్తంగా ‘భారతీయుడు 2’తో పాటు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే..

 

1 /9

‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..మొత్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

2 /9

  యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కేజీఎఫ్ 2’. ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల్లో ఇది అత్యధికం అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.

3 /9

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్  లో నటించిన సినిమా ‘2.O’. ఈ సినిమా తెలుగులో రూ. 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ తెలుగులో ఈ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.

4 /9

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన మూవీ ‘ఐ’ (మనోహరుడు). ఈ సినిమా తెలుగులో రూ. 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /9

రజినీకాంత్ హీరోగా పీఏ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /9

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కబాలి’. ఈ సినిమా తెలుగులో రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /9

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ ‘రోబో’. ఈ సినిమా తెలుగులో రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

8 /9

కమల్ హాసన్ టైటిల్ రోల్లో సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 25 కోట్ల షేర్ రాబట్టాలి.

9 /9

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సింగం 3’. ఈ సినిమా తెలుగులో రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ సరైన విజయం నమోదు చేయలేకపోయింది.