Carrot Juice Benefits: ఉదయాన్నే ఈ రసం తాగితే శరీరానికి లాభాలే లాభాలు..

Carrot Juice Benefits: ప్రతి రోజు క్యారెట్‌ రసం తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఈ క్యారెట్‌ రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2024, 12:33 PM IST
Carrot Juice Benefits: ఉదయాన్నే ఈ రసం తాగితే శరీరానికి లాభాలే లాభాలు..

Carrot Juice Benefits: ఆహారాల్లో క్యారెట్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ A, బీటా కెరోటిన్ యాంటీఆక్సిడెంట్ కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే విటమిన్ K, విటమిన్ B6 ఎముఖ దృఢత్వాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా రక్తాన్ని గడ్డకట్టించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.  అలాగే ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించేందుకు దోహదపడుతుంది. దీంతో పాటు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అయితే క్యారెట్‌ను జ్యూస్‌లా తయారు చేసి తీసుకోవడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

క్యారెట్ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. కంటి ఆరోగ్యానికి మంచిది: 

క్యారెట్‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రే చికటి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు క్యారెట్‌ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి తరచుగా కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా క్యారెట్‌ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల ఇతర జబ్బుల ప్రమాదం కూడా సులభంగా తగ్గుతుంది. 

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: 
క్యారెట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. తరచుగా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు తప్పకుండా క్యారెట్ రసం తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలతో బాధఫడేవారికి విముక్తి కూడా లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 

3. గుండె ఆరోగ్యానికి మంచిది:
క్యారెట్‌లోని పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని కారణంగా గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే క్యారెట్‌ రసంలో ఉండే ఫైబర్ గుండె నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ప్రతి రోజు ఈ రసం తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

4. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పేగు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇటీవలే అధ్యయనంలో తెలిపిన వివరాల ప్రకారం, క్యారెట్ రసం క్రమం తప్పకుండా తాగే వ్యక్తులు మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుందని తెలింది. దీంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యంగా కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News