Revolt Rv 400 Ev Price: ప్రముఖ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ తయారీ కంపెనీ రివోల్ట్ మార్కెట్లోకి ఇటీవలే కొత్త బైక్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే ఈ రివోల్ట్ కంపెనీ తమ కస్టమర్స్ కోసం కొత్త పథకాన్ని పరిచయం చేసింది. ఈ పథకం ద్వారా రివోల్ట్ RV 400 ఎలక్ట్రిక్ బైక్‌ను జీరో డౌన్ పేమెంట్‌తో అందిస్తోంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు కేవలం EMI ఆప్షన్‌తో జీరో పేమెంట్ డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయోచ్చు. దీని కోసం ప్రతి నెల దాదాపు రూ.4,444 EMI బిల్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ బైక్ కొనుగోలు చేసే క్రమంలో జీరో ప్రాసెసింగ్ ఫీజుతో అందిస్తోంది. ఇవే కాకుండా రివోల్ట్ బోలెడు ఫీచర్స్‌ను అందిస్తోంది.
ఈ రివోల్ట్ RV 400 బైక్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ రిజిస్ట్రేషన్ పేపర్‌లెస్ పద్ధతిలో అందిస్తోంది. అంతేకాకుండా అన్ని పనులు డిజిటల్లో అందించేందుకు ప్రత్యేకమైన సదుపాయాన్ని కూడా అందిస్తోంది. రివోల్ట్ కంపెనీ తమ కస్టమర్స్ సులభంగా బైక్‌లు కొనుగోలు చేసేందుకు తరచుగా ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ గతంలో RV400 స్టాండర్డ్ మోటర్ సైకిల్‌తో పాటు ఇతర మోడల్‌పై రూ.5,000 డిస్కౌంట్‌ను కూడా అందించింది. అలాగే ఇతర డిస్కౌంట్లను కూడా అందించింది.
అలాగే RV400 స్టాండర్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్‌పై ఇన్పుట్ ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి అదనంగా రూ. 10,000 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్లను కూడా అందించింది. దీంతో పాటు పాత బైక్‌లను ఎక్చేంజ్ చేసేవారికి రూ. 5,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇతర బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ Revolt RV400 EV బైక్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన 3KW (మిడ్-డ్రైవ్) మోటార్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఎన్నో ఫీచర్స్‌ను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Revolt RV400 EV ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
72V, 3.24KWh లిథియం-అయాన్ బ్యాటరీ
3KW మిడ్-డ్రైవ్ మోటార్
గంటకు 85 కిమీ గరిష్ట వేగం
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజీ
15A సాకెట్ నుండి పూర్తిగా ఛార్జ్ సపోర్ట్
ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 రైడింగ్ మోడ్లుస
అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
రిమోట్ స్మార్ట్ సపోర్ట్
రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్
జియో ఫెన్సింగ్
OTA అప్డేట్ సపోర్ట్
బైక్ లొకేటర్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి