Akshay Kumar: చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్..

Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 16, 2024, 07:20 AM IST
Akshay Kumar: చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్..

Chiranjeevi - Akshay Kumar: అవును మెగాస్టార్ రూట్లో వెళ్లి దారుణంగా దెబ్బ తింటున్నాడు అక్షయ్ కుమార్. ఒకపుడు ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ కాలం మారుతుంది. ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ భాషలో ఏదైనా సినిమా హిట్టైయితే.. ఇతర భాష ప్రేక్షకులు ఆయా సినిమాలను సబ్ టైటిల్స్ తో ఎంచక్కా ఓటీటీలో చూసేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకపుడు వర్కౌట్ అయినా రీమేక్స్ ఇపుడు వర్కౌట్ కావడం లేదు. అందుకు నిదర్శనం. తాజాగా విడుదలైన అక్షయ్ కుమార్.. ‘సర్పిరా’మూవీ. ఈ సినిమా సూర్య హీరోగా నటించిన ‘సూరారై పొట్రు’ మూవీకి రీమేక్. ఈ చిత్రాన్ని అప్పట్లో కరోనా టైమ్ లో ఓటీటీ వేదికగా విడుదల చేసారు.

ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ చేసారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీ వేదికగా ఈ సినిమాను ఆదరించారు. మరోవైపు ఈ చిత్రాన్ని హిందీలో ‘ఉడాన్’ పేరుతో స్ట్రీమింగ్ కు వస్తే... హిందీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూసేసారు.

ఇలా ఓటీటీ వేదికగా చూసిన ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్.. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సుధ కొంగర  దర్శకత్వంలో ఈ సినిమా చేయడమే పెద్ద మిస్టేక్ అని చెప్పాలి.  ఈ సినిమాలో అక్షయ్ నటన సహా.. సినిమా మొత్తం బాగున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఆల్రెడీ ఓటీటీ వేదికగా చూసిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్స్ లో చూడటం ఎందుకో అనుకున్నారో.. ఈ సినిమాను పట్టించుకోలేదు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా థియేట్రికల్ అట్టర్ ఫ్లాప్ అయింది. మొత్తంగా ఓటీటీల కాలంలో ఇపుడు రీమేక్స్ ను నమ్మకోవడం వేస్ట్ అనే విషయం మరోసారి ‘సర్ఫిరా’ మూవీతో స్పష్టమైంది.

ఇక చిరంజీవి కూడా తన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా .. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ మూవీకి రీమేక్. అయితే...అప్పటికీ ఓటీటీ హవా అంతగా లేదు. పైగా ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయకుండా చూసుకున్నారు. అయితే.. చిరు రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే.. ఆ తర్వాత చిరంజీవి.. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసారు. ఆల్రెడీ ఓటీటీ వేదికగా మోహన్ లాల్ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. ఆ సినిమా తర్వాత అయినా.. చిరంజీవి మారారా అంటే లేదు. ఎపుడో ఔట్ డేటెడ్ అయిపోయినా.. అజిత్ కుమార్.. ‘వేదాలం’ సినిమాను తెలుగులో ‘భోళా శంకర్’ గా రీమేక్ చేసారు. ఈ చిత్రాన్ని అత్యంత పేలవంగా దర్శకుడు మెహర్ రమేశ్ తెరకెక్కించాడు. దీంతో ఆడియన్స్  ఈ సినిమాను తిప్పి కొట్టారు. ‘భోళా శంకర్’ మూవీ కాస్త బోల్తా శంకర్ గా మారడంతో  మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల ‘బ్రో డాడీ’ మూవీని రీమేక్ చేద్దామనుకున్న ఆలోచనను మెగాస్టార్ విరమించుకున్నారు. ఏది ఏమైనా ఓటీటీ కాలంలో కూడా ఇలా ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని మరో భాష ప్రేక్షకులపై రుద్దాలనుకోవడం అవివేకం అనే చెప్పాలి. ఆడియన్స్ కూడా ఒకప్పటిలా ఏ సినిమా పడితే.. ఆ సినిమాను  చూడటం లేదు. పైగా టికెట్ రేట్స్ కూడా సామాన్య ప్రేక్షకులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఏదైనా కొత్త కంటెంట్ ఉంటే కానీ.. థియేటర్స్ వైపు ప్రేక్షకులు కదలడం లేదు. ఏది ఏమైనా ఇలా రీమేక్ చేసి ప్రేక్షకులపై ఒదిలిన సినిమాలను వాళ్లకే ఏకు మేకులా దింపుతున్నారు. మరి సర్ఫిరా మూవీ ఫలితంతోనైనా.. అక్షయ్ కుమార్..ఇకపై రీమేక్ ల ఆలోచనలకు పులిస్టాపు పెడతారా లేదా అనేది చూడాలి.

Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News