Garlic Benefits: వెల్లుల్లి.. నిత్యవసర ఆహార పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి.. ముఖ్యంగా వెల్లుల్లి ఆరోగ్య సంజీవని అని కూడా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా వెల్లుల్లి తినడం వల్ల వివిధ రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని చెబుతూ ఉండడం గమనార్హం ..అంతేకాదు వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇకపై జిమ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు అని చెబుతున్నారు మరి వెల్లుల్లి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ..? వెల్లుల్లి ఎలా తింటే మనకు ప్రయోజనం కలుగుతుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
వెల్లుల్లిని ఎలా? ఎప్పుడు తినాలి?
వెల్లుల్లి రెబ్బలను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున తాగాలి..
కలిగే ప్రయోజనాలు..
ఇలా పరగడుపున తాగడం వల్ల జలుబు, దగ్గు, అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి. వెల్లుల్లి అడ్రినలైన్ ను అధిక ప్రమాణంలో విడుదల చేయడం వల్ల నరాలు ఉత్తేజితం అయ్యి శరీర జీవక్రియ బాగా జరిగేటట్టు చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగిస్తుంది. ఫలితంగా త్వరగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కెమికల్ కారణంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు.ముఖ్యంగా వెల్లుల్లి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియాల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.. కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య కూడా దరిచేరదు. అధిక రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లి తరచూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు..
ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా..
వెల్లుల్లి ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా సహాయపడుతుంది.. ముఖం అందంగా మారాలి అంటే వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ముఖం పైన ఉండే మొటిమలు, మచ్చలు పోయి.. చర్మం మెరవాలి అంటే పచ్చి వెల్లుల్లి రెబ్బలను రెండింటిని తీసుకొని.. మెత్తగా గ్రైండ్ చేసి గోరువెచ్చని నీళ్లల్లో ఉదయాన్నే కలుపుకొని తాగితే చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఎన్నో పోషకాలు శరీరాన్ని త్వరగా వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.. పైగా శరీరం ఫిట్గా స్ట్రాంగ్ గా ఉంటుందట..అందుకే వెల్లుల్లి తినలేని చాలామంది..ఈ ప్రయోజనాలు తెలిసిన తర్వాత కచ్చితంగా తింటారనటంలో సందేహం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి