Parliament Session: వాడీవేడీగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నీట్, డిప్యూటీ స్పీకర్ పదవిపై ప్రతిపక్షాల పట్టు..

Parliament Session: కేంద్రంలో వరుసగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు దీరిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో  ప్రవేవ పెట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆగష్టు 12 వరకు కొనసాగుతాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 22, 2024, 08:06 AM IST
Parliament Session: వాడీవేడీగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నీట్, డిప్యూటీ స్పీకర్ పదవిపై ప్రతిపక్షాల పట్టు..

Parliament Session: వరుసగా మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం.. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక సర్వేను ప్రకటించనున్నారు. మరోవైపు రేపు 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం పలు బిల్లులను సభా ఆమోదం కోసం తీసుకురాబోతుంది. మరోవైపు ఈ సమావేశాల్లోనే నీట్ ప్రశ్నా పత్రం లీకేజీ, రైల్వే భద్రతతో పాటు కావడి (కన్వర్) యాత్ర జరిగే రూట్లో హోటల్ యాజమానుల పేర్లు రాయాలనే నిబంధన తీసుకురావడం వంటి అంశాలపై కేంద్రాన్ని ప్రతిపక్షాలు ఉమ్మడిగా నిలదీయనున్నాయి. మరోవైపు సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్.. రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన  అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించింది.

ఈ సారి అఖిల పక్ష సమావేశంలో ఒక్కో సభ్యుడున్న పార్టీని కూడా కేంద్రం ఆహ్వానించింది. మొత్తంగా 44 పార్టీల నుంచి 55 మంది నేతలు ఈ సమావేశానికి హాజరై తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ సారి సమావేశాల్లో అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. మరోవైపు బిహార్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ, బిజూ జనతా దళ్ , జేడీయూ నేతలు ప్రస్తావించడం గమనార్హం.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే కావడి యాత్రపై సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. అంతేకాదు 24 శాఖలకు సంబంధించిన స్థాయీ సంఘాలను ఏర్పాటు చేయాలని  కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఉచిత ఇంటర్నెట్ కల్పించాలనే ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ సమావేశాల్లో పౌరసత్వ సవరణ, డీప్ ఫేక్ సహా  23 బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News