ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆరంభంలో పోలింగ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీంతో తొలి సెషన్ లో పోలింగ్ శాతం తక్కువ శాతం నమోదైంది. అయితే మధ్యాహ్నానికి ఉపందుకొని ఒంటి గంట వరకు 48 శాతం ఓటింగ్ నమైదైంది...ఇదు జోరు సాయంత్ర వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల కల్లా 66 శాతం పోలింగ్ నమోదైంది.
క్యూసైన్లో ఉన్న వారు ఇంకా ఓట్లు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఏపీలో పోలింగ్ 80 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ద్వివేది పేర్కొన్నారు.
విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ను ముగించారు. నిర్ణీత సమయంలోపు క్యూలైన్లలో చేరినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాల వివరాలను ఓ సారి పరిశీలిద్దాం...
శ్రీకాకుళం 63.77
విజయనగరం 74.18
విశాఖ 55.82
పశ్చిమగోదావరి 67.28
కృష్ణా 64.50
గుంటూరు 61.12
ప్రకాశం 70.74
నెల్లూరు 66.90
చిత్తూరు 69.32
కడప 63.90
అనంతపురం 67.08
కర్నూలు 63.00
పోలింగ్ సందర్భంలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ ఓటర్లు మాత్రం బెదరలేదు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలిరావడం గమనార్హం.