Telangna Budget Session: తెలంగాణ అసెంబ్లీ విషయానికి వస్తే ఇక్కడ కథ మరో రకంగా ఉంది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మాటల యుద్దం నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అటాక్ చేస్తుంటే అదే సమయంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు లు ఎటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ గత పదేళ్ల పాలనపై బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ అంతే స్థాయిలో కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగుతోంది.
అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి.రూలింగ్, అపోజిషన్ పార్టీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభ మారుమోగతుంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కూడా తమ దైన స్టైల్ పంచులు పేలుస్తున్నారు. ఇలా అసెంబ్లీ సమావేశాలు అంతా కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.
మరోవైపు అడపా దడపా బీజేపీ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్బంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సభకు హాజరుకావడంతో సభా సమావేశాలు మరింత హాట్ గా మారాయి. చాన్నాళ్ల తరువాత కేసీఆర్ అసెంబ్లీకీ హాజరుకావడంతో ఇటు అధికార ,ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తికరంగా సభను ఫాలో అవుతున్నారు. దీంతో పాటు లాబీల్లో కూడా నేతలు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటున్నారు. దీంతో మీడియా కూడా తెలంగాణ అసెంబ్లీను హైలైట్ చేస్తుంది. అంతేకాదు కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ ఎత్తి చూపితే.. కేసీఆర్ గత ప్రభుత్వ లెక్కలను బయట పెడతా నంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ సమావేశాల్లో ఇంకెన్ని మలుపులు ఉంటాయో చూడాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter