ఛైతూ సమంత జంట కలిసి నటించిన మజిలీ మూవీ సైలెంట్ దూసుకెళ్తోంది. ఈ మూవీ విడుదలైన నిన్నటికి సరిగ్గా 2 వారాలు పూర్తి చేసుకుంది. 10 రోజులు దాటితే థియేటర్లలో సినిమా నిలవడం కష్టంగా మారుతోంది. అలాంటిది మజిలీ సినిమా ఏకంగా 2 వారాల రన్ పూర్తి చేసుకుంది. అంతే కాదు మరో 2 వారాలు కూడా నిలబడేంత స్టామినా సంపాదించుకుంది.
నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విడుదలైన ఈ 14 రోజుల్లో వరల్డ్ వైడ్ 36 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 వారాల్లో 28 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. మజిలీయా మజాకా !!