Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

Mahindra Thar Roxx: భారత మార్కెట్‌లో మహీంద్రా థార్‌కి ఎంత డిమాండ్‌ ఉందో అందిరికీ తెలిసిందే.. ప్రీమియం ఫీచర్స్‌తో కూడి ఈ SUVకి ఆప్డేట్‌ వేరియంట్‌లో మరో థార్‌ రాబోతోంది. అయితే ఈ కొత్త మహీంద్రా థార్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 30, 2024, 12:05 PM IST
Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

 

Mahindra Thar Roxx: భారత ఆటో మొబైల్‌ కంపెనీ తమ కస్టమర్స్‌కి అతి త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. ఆఫ్‌- రోడింగ్‌ విభాగంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన థార్ SUVని ఆప్డేట్‌ వేరియంట్‌లో తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భులమైన కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో మహీంద్రా థార్ 3 డోర్స్‌తో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే రాబోయే కొత్త థార్ మాత్రం 5 డోర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఐదు డోర్ల థార్‌కి కంపెనీ థార్ రోక్స్ అని పేరును కూడా ఆప్డేట్‌ చేసింది. దీంతో ఇటీవలే మహీంద్రా థార్ రాక్స్ టీజర్‌ను కూడా లాంచ్‌ చేసింది. అయితే ఈ థార్ రాక్స్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా కంపెనీ తాజా విడుదల చేసిన థార్ రాక్స్‌ (Mahindra Thar ROXX) టీజర్‌లో టాప్ వేరియంట్‌ పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఆఫ్‌ రోడ్డు కార్లలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించడం ఇదే మొదటిసారని మార్కెట్‌లో దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ టీజర్‌లో థార్‌ SUVకి సంబంధించి లోపలి భాగాన్ని కూడా షేర్‌ చేసింది.    దీని బట్టి చూస్తే ఈ కారు లోపలి భాగంలో ప్రీమియం సీటర్స్‌తో పాటు అద్భుతమైన ఫినిషింగ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

థార్ రాక్స్ డిజైన్‌కి సంబంధించిన వివరాలు:
ఈ 5 డోర్ల మహీంద్రా థార్ రాక్స్‌ (Mahindra Thar ROXX) ఫ్రంట్ ఫాసియాలో కొత్త గ్రిల్ సెక్షన్ సెటప్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని వెనక భాగంలో 4×4 బ్యాడ్జింగ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో కంపెనీ అల్లాయ్ వీల్స్‌ను కూడా చేంజ్‌ చేసింది. దీంతో పాటు ఈ థార్‌ మందపాటి బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్‌తో వస్తోంది. దీని పరిమాణం ఇటీవలే లాంచ్‌ అయిన జీప్‌ కంపెనీ హెవీ SUVలా ఉంటుంది. అలాగే దీని వీల్‌బేస్ చాలా పొడవుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో లాంచ్‌ అయితే 5-డోర్లతో లాంచ్‌ అయిన ఫోర్స్ గూర్ఖాతో పోటీ పడనుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఈ థార్ రాక్స్‌లో మహీంద్రా లోపల ఫ్రంట్‌ భాగంలో 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. కారు సెక్యూరిటీ కోసం 360-డిగ్రీ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే మౌంటెడ్ కంట్రోల్‌ సిస్టమ్‌తో రన్‌ అయ్యే స్టీరింగ్ వీల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఇందులో అందరికీ ఎంతో ఇష్టమైన పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ కారు రెండు ఇంజన్‌ వేరియంట్స్‌లో రాబోతోంది. ఇక పవర్‌ట్రెయిన్‌ వివరాల్లోకి వెళితే ఇది,  2.2-లీటర్ డీజిల్‌తో పాటు  2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లలో రాబోతున్నట్లు మహీంద్రా వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News