Revanth Reddy-Chiranjeevi: రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే?

Chiranjeevi: నంది అవార్డ్స్ గురించి.. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న చర్చ తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికే పలుమార్లు.. పలు సెలబ్రిటీస్ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను.. రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈమధ్య సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అవార్డులను గద్దర్ పేరుతో ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ దీనిపై సినీ పరిశ్రమ వారు స్పందించలేదంటూ.. ఈరోజు జరిగిన ఒక ఈవెంట్లో రేవంత్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఈ విషయంపై స్పందించారు చిరంజీవి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 30, 2024, 08:54 PM IST
Revanth Reddy-Chiranjeevi: రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే?

Chiranjeevi about Gaddar Awards: ఒకప్పుడు నంది అవార్డుల.. కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు. ప్రతి సంవత్సరం తమ అభిమాన హీరోలకు.. అభిమాన చిత్రాలకు.. నంది అవార్డులు రావడం ప్రతిష్టాత్మకంగా భావించేవారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విడిపోయాక.. ఈ నంది అవార్డులు కాస్త కనుమరుగయ్యాయి. రెండు ప్రభుత్వాలు ఈ అవార్డుల గురించి పట్టించుకోలేదు ‌ దాంతో సినిమా పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే.. నంది అవార్డుల ఊసే లేకుండా పోయింది. 

అయితే దీనిపై.. ఎంతోమంది సెలబ్రిటీస్ వివిధ రకాలుగా స్పందించారు. ఎంతోమంది సినీ ప్రముఖులు.. మళ్లీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వాలి అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తించడమే కాకుండా.. రెండు రాష్ట్రాల గవర్నమెంట్ ని కూడా కలుస్తూ వచ్చారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ప్రతిష్టాత్మక నంది అవార్డులను.. గద్దర్ అవార్డుల పేరిట సినిమా పరిశ్రమ వారికి ఇస్తాము అంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా జరపాలి అనేదానిపై.. ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలు కూడా అందించమంటూ అభ్యర్థన చేశారు.

కానీ దీనిపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించడం లేదని.. ఇటీవల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నేడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌ధానోత్స‌వ‌ ఈవెంట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా పరిశ్రమ చేసిన కృషికి.. గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన‌ట్లుగా చెప్పారు. కానీ ఆ అవార్డుల గురించి సినీ పరిశ్రమ వారు మౌనంగా ఉండ‌డం ప‌ట్ల.. రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ.. ఇలా వారి స్పందించకపోవడం బాధాకరమ‌న్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి. 

దీంతో ఈ విషయం గురించి సినీ సెలబ్రిటీస్.. ఒక్కొక్కరూ స్పందిస్తూ వస్తుండగా.. చిరంజీవి సైతం స్పందించారు. గతంలో గద్దర్ అవార్డ్స్ కి తను సపోర్ట్ గా మాట్లాడిన వీడియోని.. ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ షేర్ చేస్తూ..’ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను.. పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని.. ప్రతిభావంతులకు.. ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత..తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లడానికి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంతు రాసుకొచ్చారు. దీంతో చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది. 

 

Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్‌ రెడ్డి అసంతృప్తి

Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News