Ram Potheneni: ప్రస్తుతం పెద్దగా సినిమాలు తీకపోయినా ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎందరో హీరోలతో అతను సినిమాలు తీసాడు. తన సినిమాలతో స్టార్ హీరోలకి.. లైఫ్ ఇవ్వడంతో పాటు వారికంటూ సపరేట్ మేనరిజమ్స్.. ను కూడా క్రియేట్ చేసి ఇచ్చాడు. మహేష్ బాబు కెరీర్ లో అద్భుతమైన చిత్రాలుగా గుర్తింపు తెచ్చుకున్న పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలు.. పూరి తీసినవే. ఈ సినిమాలో సక్సెస్ తర్వాత మహేష్ బాబు.. ఓ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఒకప్పుడు.. పూరి తాను రాసిన స్క్రిప్ట్ లన్ని పవన్ కళ్యాణ్ కి వినిపించేవాడు. పవన్ కి కుదరక చేయలేని సినిమాలను.. రవితేజతో తీసేవాడు. రవితేజ కి మాస్ మహారాజ్ ఇమేజ్ రావడంలో పూరి.. పాత్ర ఎంతో ఉంది. తన సినిమాలలో పూరి కన్వే చేసే ఫిలాసఫీ.. చాలామందికి నచ్చేది. అయితే జనరేషన్ మారుతున్న కొద్ది.. మనిషి అభిరుచిలో కూడా చాలా మార్పు వస్తుంది. అలానే ఒకప్పుడు ఎంతో రుచించే పూరి జగన్నాథ్.. ఫిలాసఫీలు ఇప్పుడు ప్రేక్షకులకు అంతగా సెట్ అవ్వడం లేదు.
ఇప్పుడు పూరి జగన్నాథ్ రాస్తున్న స్టోరీలలో ఒకప్పటి పవర్ లేదు.. అన్న మాట కూడా వాస్తవమే. అందుకే అతని సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. దీంతో అతనితో సినిమాలు తీయాలి అనుకున్న.. ప్రొడ్యూసర్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. పూరి తన కెరీర్ లో ఎంత సక్సెస్ చూశాడో ఇప్పుడు అంతకంటే ఫెయిల్యూర్ చూడాల్సి వస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రామ్ పోతినేని పూరిని బాగా విసిగించాడు అని టాక్.
అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది అన్న.. విషయం చెప్పడం కష్టం. కానీ 15 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇంకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. ఈ నేపథ్యంలో హీరో డైరెక్టర్ కి మధ్య ఏదైనా ఉందా అన్న డౌట్లు.. రాకుండా ఉండవు. స్టార్ హీరోల కోసం సైతం ఎదురు చూడకుండా వేరే హీరోతో.. సినిమాలు చేసే పూరి సెట్ లో రామ్ కోసం ఎన్నోసార్లు వెయిట్ చేయాల్సి వచ్చిందట. పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు.. సినిమా రిలీజ్ చేసినట్టుగా ఎటువంటి హడావిడి లేకుండా డబుల్ ఇస్మార్ట్ సినిమాని విడుదల చేయడానికి పూరి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.. అంతేకాదు మూవీ విడుదలైన తర్వాత ఒక.. ప్రత్యేకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హీరో వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా వెల్లడించడానికి పూరి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే మూవీ విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.
Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్ దిగ్బంధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook