Lotus Tea: షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో ఈ టీ ఒక దివ్య ఔషధం!!

Lotus Tea Health Benefits: తామరపువ్వు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంతో తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Aug 3, 2024, 10:22 AM IST
Lotus Tea: షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో ఈ టీ ఒక దివ్య ఔషధం!!

Lotus Tea Health Benefits: తామరపువ్వు టీ ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్న ఒక ఆరోగ్యకరమైన పానీయం. తామరపువ్వులు  అద్భుతమైన అందంతో మనల్ని ఆకట్టుకుకోవడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ టీ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, అనేక రకాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని మార్కెట్‌లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు. దీని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. 
తామరపువ్వులు నీటిలో పెరిగే మొక్కలు. వీటి పూలు అందంగా ఉండటమే కాకుండా ఆయుర్వేదంలో వీటిని వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. తామరపువ్వులను ఆరబెట్టి, వాటితో టీ తయారు చేస్తారు. ఈ టీకి మంచి సువాసన ఉంటుంది. సాధారణ టీలతో పోలుస్తే ఈ టీకి ఎంతో ప్రముఖ్యత ఉంది. ఇప్పుడు దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు గురించి తెలుసుకుందాం. 

తామరపువ్వు టీ  ఆరోగ్య ప్రయోజనాలు:

తామరపువ్వు టీ చర్మాన్ని కాంతివంతం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని చర్మనిపుణులు చెబుతున్నారు. దీని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఈ టీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తామరపువ్వు టీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా  మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తామరపువ్వు టీ తయారీ విధానం:

తామరపువ్వులు తాజా లేదా ఆరబెట్టినవి తీసుకోండి. ఒక కప్పు నీటిని మరిగించండి. మరిగించిన నీటిలో ఒక చెంచా తామరపువ్వులను వేసి 5-10 నిమిషాలు కాయనివ్వండి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి, చల్లబరిచి తాగండి.

ముఖ్యమైన విషయాలు:

 అధికంగా తాగడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
 ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, తామరపువ్వు టీ తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా లేకుండా తామరపువ్వు టీ తాగకూడదు.

ముగింపు:

తామరపువ్వు టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక సహజ పానీయం. అయితే, దీనిని తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

గమనిక:

ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

 

Trending News