Prabhas: ప్రభాస్‌తో నాకు పెళ్లి.. నిజమైతే బాగుండు.. స్టార్ హీరోయిన్ కోరిక

Prabhas Wedding: ప్రభాస్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా పరంగా.. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరో పైన.. ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 5, 2024, 01:50 PM IST
Prabhas: ప్రభాస్‌తో నాకు పెళ్లి.. నిజమైతే బాగుండు.. స్టార్ హీరోయిన్ కోరిక

Prabhas - Payal Rajput: ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోస్ లో.. ప్రభాస్ రేంజ్ వేరు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు.. తెచ్చుకున్నారు ఈ హీరో. అందుకే ప్రభాస్ నటించిన సినిమాలపై.. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా.. అన్ని ఇండస్ట్రీలో కూడా అంచనాలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో యమ బిజీగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన కల్కి 2898 AD.. ఈ హీరోకి మంచి విజయం అందించిన సంగతి తెలిసిందే. సలార్ 2, ది రాజా సాబ్, కల్కి 2,  స్పిరిట్ సినిమాలతో త్వరలోనే ప్రేక్షకులను మరింత అలరించడానికి సిద్ధమవుతున్నారు. 

కాగా ప్రభాస్ కి సినిమా ఇండస్ట్రీ బయటే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా.. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ కి ప్రభాస్ క్రష్. ఈ క్రమంలో ఒక హీరోయిన్ ప్రభాస్ గురించి.. చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు.. దగ్గరైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోని ఎంతో బోల్డ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత కూడా కొన్ని బోల్డ్.. సినిమాలలో కనిపించి మెప్పించింది. వెంకటేష్ లాంటి సీనియర్ హీరోస్ తో వెంకీ మామ లాంటి చిత్రాల్లో కూడా నటించింది. కాగా ఈ మధ్య ఈ హీరోయిన్ మరోసారి.. తనకి మొదటి విజయం అందించిన ఆర్ఎక్స్ 100..దర్శకుడు విజయ్ భూపతి తో చేసిన మంగళవారం మంచి విజయం సాధించింది. అయితే పాయల్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే.. ప్రభాస్ అని వెంటనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హీరోయిన్ గతంలో.. పలు ఇంటర్వ్యూస్ లో ప్రభాస్ పై తన అభిమానాన్ని వెలబుచ్చారు. తాజాగా మరో ఇంటరెస్టింగ్ స్టేట్మెంట్ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

ఈ మధ్యనే ఫిలింఫేర్ అవార్డ్స్ కి అటెండ్ అయ్యింది పాయల్. ఈ క్రమంలో ‘ మీ గురించి వచ్చిన.. ఒక ఫన్నీ రూమర్ ఏంటి’.  అని జర్నలిస్ట్ పాయల్ ని ప్రశ్నించగా.. ‘ప్రభాస్ తో పెళ్లి అయిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి‌. వాటిని చూసి నవ్వుకున్న. కానీ ఆ రూమర్స్ నిజమైతే బాగుండేది అనుకున్నా’.. అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.

Also Read: Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!

Also Read: Rajamouli: బాహుబలిలో అలాంటి తమన్నా సీన్స్ అందుకే పెట్టాము.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News