Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!

Gold Hall mark: శ్రావణమాసం వచ్చింది..ఈ మాసం అంతాకూడా వివాహాది శుభకార్యాలు, ఫంక్షన్లు, పూజలతో బిజీబిజీగా గడుపుతారు. శ్రావణమాసంలో ప్రతిరోజూ మంచి రోజే. ఈ మాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగారం, వెండి నగలను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వీరిని ద్రుష్టిలో ఉంచుకుని నగల షాపులు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అయితే మీరు నగలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే నగలు కొనేముందు BISహాల్ మార్క్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. బంగారం నాణ్యతలను గుర్తించాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 7, 2024, 05:55 PM IST
Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!

Gold Hall mark: భారతీయులకు, బంగారానికి మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. సందర్భం ఏదైనా సరే బంగారం కొనాల్సిందే. పండగలు, శుభకార్యాలు అయితే తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగానూ..స్టేటస్ గానూ భావిస్తారు. అయితే ముఖ్యంగా పండగల సందర్భం, పెళ్లిళ్ల సీజన్లో నగల షాపులు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటారు. మనం బంగారం కొనుగోలు చేసేటప్ప్పుడు స్వచ్చమైన బంగారాన్ని కొంటున్నామా? లేదా? అనే ప్రశ్న మనస్సులో కచ్చితంగా వస్తుంది. బంగారం యాజమానులు మోసం చేస్తున్నారా?పెద్ద పెద్ద నగల షాపులు మాత్రమే స్వచ్చమైన బంగారాన్ని విక్రయిస్తాయా?చిన్న చిన్న షాపుల్లో మోసం జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు మన మదిలో ఎన్నో మెదలుతుంటాయి. ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే..బంగారం కొనుగోలు చేసే ముందుకు BIS హాల్‌మార్క్‌ గురించి తెలుసుకోండి. ఎందుకంటే BIS హాల్‌మార్క్‌ ఉంటే ఆ బంగారం స్వచ్చమైన బంగారమని అర్ధం.  అయితే BIS హాల్‌మార్క్‌తో స్వచ్ఛమైన బంగారాన్ని ఎలా గుర్తించాలి అనేది మళ్లీ ప్రశ్న? బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్వచ్చతను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

మీరు బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడల్లా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా హాల్‌మార్క్  చేసి ఉండాలన్న విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నగలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ నగలపై  BIS హాల్‌మార్క్‌  గుర్తు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జులై 1, 2021వ సంవత్సరంలో బంగారు నగలపై బిఐఎస్ హాల్ మార్క్ తప్పనిసరిగా ఉండాలని భారత ప్రభుత్వం హాల్ మార్కింగ్ గుర్తును సవరించింది. BIS హాల్‌మార్కింగ్ గోల్డ్‌పై మీరు మూడు సింబల్స్ చూడాలి. 

1. BIS స్టాండర్డ్ మార్క్

2. స్వచ్ఛత ఫిట్‌నెస్ గ్రేడ్

3. 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (HUID సంఖ్య)

ఈ మూడు తప్పనిసరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 

BIS స్టాండర్డ్ మార్క్:

బంగారు నగలపై మీరు మొదట చూడాల్సిన గుర్తు  BIS లోగో. ఈ గుర్తు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. బంగారు ఆభరణాలపై ఉన్న ఈ లోగో స్టాంపు, కొనుగోలు చేస్తున్న ఆభరణాలు BIS సర్టిఫికేట్ పొందిన కేంద్రం నుండి తనిఖీ చేసినట్లు సూచిస్తుంది.

స్వచ్ఛత ఫిట్‌నెస్ గ్రేడ్:

నగలు కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు చెక్ చేయాల్సిన రెండో విషయం..బంగారం స్వచ్చత. ఈ గుర్తు బంగారం స్వచ్చతను సూచిస్తుంది. బంగారు  ఫిట్ నెస్ గ్రెడ్  14K, 18K, 20K, 22K, 23K,  24K.

-బంగారు ఆభరణాలపై 22K916 స్టాంప్ ఉంటే..బంగారు వస్తువులో 91.6% బంగారం, 8.4% ఇతర లోహాలు ఉన్నాయని అర్థం.

-బంగారు ఆభరణాలపై 18K750 ఉంటే 75% బంగారం, 25% ఇతర లోహాలు ఉన్నాయని అర్థం.

-బంగారు ఆభరణాలపై 14K585 స్టాంప్ ఉంటే, 58.5% బంగారం, 41.5% ఇతర లోహాలు ఉన్నట్లు అర్ధం. 

6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, మీరు బంగారు వస్తువుపై మూడవ గుర్తుతో కూడిన 6 అంకెల కోడ్‌ను ఉందో లేదో  చెక్ చేసుకోవాలి. ఈ కోడ్‌ను హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) అంటారు. ఈ కోడ్ ప్రతి ఆభరణానికి భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను BIS కేర్ యాప్‌లో కూడా ధృవీకరించవచ్చు.

హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలపై BIS ఛార్జ్:

మీరు బిఐఎస్ హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే,దానికి ఛార్జీలు వసూలు చేస్తారు. ఒక్కో వస్తువుకు రూ.45 వసూలు చేస్తారు. ఈ ఛార్జీ బంగారం ధరలోనే యాడ్ చేస్తారు. దీన్ని ఫ్లాట్ ఛార్జ్ అంటారు. దీనికి బంగారం బరువుతో సంబంధం ఉండదు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News