మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలు; కౌంటింగ్ ఏర్పాట్లపై స్పందించిన ఎన్నికల అధికారి  గోపాలకృష్ణ ద్వివేది

ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు

Last Updated : May 22, 2019, 07:30 PM IST
మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలు; కౌంటింగ్ ఏర్పాట్లపై స్పందించిన ఎన్నికల అధికారి  గోపాలకృష్ణ ద్వివేది

మరి కొన్ని గంటల్లో నేతల తలరాతలు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. ఇటు దేశంలో..ఇటు రాష్ట్రంలో అధికార పీఠం ఎవరిదనే సస్పెన్స్ కు తెరపడనుంది. అదేనండి  రేపు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెలుడించనున్నారు. ఉదయం 8:30కి ఫలితాల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ తేలిపోతుంది. ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియమధ్యాహ్నం 2 గంటల పూర్తయ్యే అవకాశముంది. అయితే వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ   తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించి అనంతరం ఈవీఎంల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని ద్వివేది స్పష్టంచేశారు

ప్రతీ నియోజకవర్గానికి ఓ పరిశీలకుడు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం సర్వం సిద్ధం చేశామన్నారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. కౌంటింగ్ కోసం రాష్ట్రంలో మొత్తం 36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు పెట్టామన్నారు. అలాగే ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు...పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారని వివరించారు. 

Trending News