Huge python broke into enclosure by breaking the sidewalls video goes viral: చాలా మంది పాములు, కొండ చిలువలంటేనే భయంతో పారిపోతుంటారు. ఎక్కడైన పాములు కన్పిస్తే ఆ ప్రదేశాలకు ఆమడ దూరం ఉంటారు. మరికొందరైతే పాములు, కొండ చిలువల పేర్లు ఎత్తడానికి కూడా అస్సలు ఇష్టపడరు. ఇదిలా ఉండగా.. పాములు కొండ చిలువలకు చెందిన వీడియో ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. వర్షాకాలంలో పాములు ఎక్కువగా ఎలుకల వేటలో మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి మనుషుల్ని కాటు వేస్తుంటాయి.
Snake found in one of the village in India pic.twitter.com/oSVjOgnWfg
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 7, 2024
కొందరు పాము కాటు కు గురైన వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మరికొందరు మాత్రం.. అప్పటికే విషం బాడీ అంతా వ్యాపించడం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. మరోవైపు.. కొండ చిలువలు చాలా డెంజర్ అని చెప్పవచ్చు. ఇది అమాంతం మనిషి మీద దాడి చేసి ఎటుకదలకుండా, శరీరం ను పిండేస్తాయి. అవి గట్టిగా చుట్టేసుకుని ఊపిరాడకుండా చేసి, చంపేస్తుంటాయి. మరోవైపు ఇవి మనుషుల్ని సైతం..అమాంతం మింగేస్తుంటాయి. ఇప్పటికే పాములు, కొండ చిలువలకు చెందిన అనేక వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా, మరో షాకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
పూర్తి వివరాలు..
కొండ చిలువకు చెందిన ఒక వీడియోప్రస్తుతం సామాజిక మాధ్యమాంలో వైరల్ గా మారింది. ఒక షెడ్డూలోకి భారీ కొండ చిలువ ప్రవేశించింది. అది అప్పటికే ఏదోజంతువునో... మరేంటో దాన్ని మింగింది. ఎటుకదల్లేక తెగ ఇబ్బందులు పడుతుంది. అది అక్కడే ఉన్న షెడ్డునుంచి లోపలికి ప్రవేశించింది. ప్రహారి గోడ కంచెను కూల్చేసి మరోలోపలికి ఎంట్రో ఇచ్చింది. దాని కడుపు ఎంతో ఉబ్బుగా ఉంది.
కొండ చిలువను చూస్తేనే పై ప్రాణాలు అటే పోయేలా ఉన్నాయి. ఈ వీడియోను.. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదేం కొండ చిలువ అంటూ భయపడిపోతున్నారు. మరికొందరు ఎంత పెద్దగా ఉందంటూ కూడా .. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter