Uttarakhand nurse raped and killed: దేశంలో మహిళల భద్రత పెను సవాల్ గా మారిందని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడంలేదు. ఆడది కన్పిస్తే చాలు.. కొందరు మనిషి రూపంలో ఉన్నపశువులు రెచ్చిపోతున్నారు. పసిపాపల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఏ ఒక్కర్ని వదలడంలేదు. ఇటీవల కోల్ కత్తాలో జూనియర్ వైద్యురాలి ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇండిపెండెన్స్ వేళ సంచలనంగా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రుద్రపూర్ కు చెందిన ఒక యువతి.. నైనిటాల్ లో నర్సుగా పనిచేస్తుంది. ఆమె గత నెల 30 న విధులు ముగించుకుని తిరిగి తన ఇంటికి వస్తుంది. కానీ ఇంతలో ఏమైందో కానీ ఆమె కన్పించకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు వెతికి ,వెతికి చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోవారం తర్వాత.. సదరు యువతి డెడ్ బాడీ.. ఉత్తర ప్రదేశ్ లోని దిబ్దిబా ప్రాంతంలో ఉండటాన్నిపోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈనేపథ్యంలో డాక్టర్లు సదరు నర్సుపై కూడా అత్యాచారం చేసి, హతమార్చినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో.. రాజస్తాన్ కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమదైన శైలీలో విచారించగా నేరంను ఒప్పుకున్నారు. అతను.. నర్సును పొదల్లోకి తీసుకెళ్లి.. అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, గొంతు కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఒంటిపై ఉన్న నగల్ని సైతం దొంగిలించాడు.
చోరీకి గురైన ప్రదేశం, బాధితురాలి ఫోన్ లోకేషన్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నట్లు తెలుస్తొంది. జులై 30 న మిస్సింగ్ అయిన యువతి.. వారంతర్వాత డేడ్ బాడీగా దొరకడం పట్ల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిందితుడు.. కార్మికుడిగా పనిచేస్తున్నాడు. యువతిని హత్య చేసి, డబ్బులు, నగలు తీసుకుని పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం దేశంలో మరో సంచలనంగా మారింది. ఇప్పటికే కోల్ కతా కేసు కుదిపేస్తుండగా.. ఇప్పుడు నర్సును గొంత కోసం హత్య చేసిన ఘటన తీవ్ర దుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter