హిందీ భాషను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకుంది. మూడో భాషగా హిందీ నేర్చుకోవడం తప్పనిసరి కాదని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. విద్యార్ధులు మూడో భాషను తమకు నచ్చింది ఎంచుకోవచ్చని కేంద్రం పేర్కొంది. హిందీ ఆప్షన్ సబ్జెక్ట్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ఢ్రాప్ట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్రం మానవరులశాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తాము అన్ని భాషలనూ సమానంగా గౌరవిస్తామని...హిందీని తప్పనిసరి చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
హిందీ విషయంలో ప్రజాభిప్రాయం కోరిన కేంద్రం
నూతన విద్యా విధానంపై కస్తూరీ రంగన్ కమిటీ త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించింది. ఈ క్రమంలో హిందీ మాట్లడని రాష్ట్రాల్లో మూడో భాషగా హిందీని తప్పని సరిగా చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన పై తమ అభిప్రాయాలు తెలియజేయాలంటూ కేంద్రం ప్రజాభిప్రాయం కోరింది. తాజా ప్రతిపాదనపై తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కన్నెర్ర చేశారు. తమపై బలవంతంగా హిందీ భాషను రుద్ధితే ప్రతిఘటన తప్పదని ఆయా రాష్ట్రాల రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రచయితలు హెచ్చరించారు.
తీవ్రంగా వ్యతిరేకించిన దక్షిణాది రాష్ట్రాలు
ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దాలని భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని..ఉద్యమాలు తప్పవని డీఎంకే చీఫ్ స్థాలిన్ హెచ్చరించారు. కర్నాటక చీఫ్ కుమారస్వామి ఈ అంశంపై స్పందిస్తూ ప్రాంతీయ భాషలను గౌరవించాలని..హిందీని తప్పని సరి చేయలన్న ప్రతిపాదనకు తామ వ్యతిరేకంమని తేల్చి చెప్పారు. ఉత్తరాదిన దక్షిణాది భాషలు తప్పని సరి చేయాలని చురకలు అంటించారు. బెంగాల్ సఎం మమత బెనర్జీ స్పందిస్తూ తమ రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ సర్కార్ మెట్టుదిగి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.