OPPO K12X: కొత్త OPPO K12X ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు, కేవలం 12 వేలకే

OPPO K12X Discount Offer: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో బ్రాండ్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమేరా రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే మార్కెట్‌లో కొత్తగా లాంచ్ అయిన Oppo K12X భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 18, 2024, 07:58 AM IST
OPPO K12X: కొత్త OPPO K12X ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు, కేవలం 12 వేలకే

OPPO K12X Discount Offer: OPPO K12X ఇటీవలే భారతీయ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. కెమేరా, ర్యామ్, ప్రోసెసర్ అన్నీ ప్రత్యేకమే. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ఇప్పుడు భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 

OPPO K12X 5G స్మార్ట్‌ఫోన్  6.67 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 1604-720 పిక్సెల్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ స్క్రీన్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. అంటే కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. యూఎస్‌బి టైప్ సి చార్జర్ మోడ్ ఉంటుంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. దాంతో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉంటుంది. 

ఇక కెమేరా అయితే 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమేరా ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఈ ఫోన్‌పై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ నడుస్తోంది. 23 శాతం డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ ఇప్పుడు 12,999 రూపాయలకే లభించనుంది. అంతేకాకుండా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో OPPO K12X కేవలం 11,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. 

Also read: BSNL Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్ , వీఐలకు హీట్ పెంచుతున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 160 రోజుల ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News