Lokesh Kanagaraj: LCUలోకి అడుగుపెట్టనున్న బాలీవుడ్ ఖాన్.. ఇంతకీ ఎవరంటే..!

Lokesh Kanagaraj - Aamir Khan: తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన లోకేష్ కనగరాజ్.. తాజాగా ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆ హీరో మరెవరో కాదు.. అమీర్ ఖాన్. లోకేష్ కనగరాజ్.. అమీర్ ఖాన్ వంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 19, 2024, 02:02 PM IST
Lokesh Kanagaraj: LCUలోకి అడుగుపెట్టనున్న బాలీవుడ్ ఖాన్.. ఇంతకీ ఎవరంటే..!

Lokesh Kanagaraj movie with Aamir Khan: ఈమధ్య కోలీవుడ్ డైరెక్టర్లు అందరూ తమిళ్ హీరోలతో సినిమాలు కంటే.. బాలీవుడ్ స్టార్లతో సినిమాలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్లు అందరూ బాలీవుడ్ దిశగా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే పలు కోలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోలతో సినిమాలు తీశారు. 

ప్రముఖ తమిళ్ డైరెక్టర్ అట్లీ అందరికంటే ముందు షారుక్ ఖాన్ హీరోగా జవాన్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో వెంటనే ప్రముఖ మరో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ హీరోగా మరొక సినిమాని ప్రకటించారు సికిందర్ అనే ఆసక్తికరమైన టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పట్టాలెక్కింది. 

తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో మరొకసారి డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు కూడా వీళ్ళ అడుగుజాడల్లోనే వెళుతున్నారు. తాజా సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజ్ ఆమిర్ ఖాన్ హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చర్చల్లోనే ఉందట. అన్ని బాగానే జరిగితే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వస్తుంది. 

ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటులు కూడా సౌత్ సినిమా మీద మనసు పారేసుకుంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ డం ఉన్న హీరోలు అందరూ ఇప్పుడు సౌత్ లో కూడా పేరు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ డైరెక్టర్లు కూడా వారితో సినిమాలు తీసి సౌత్ లో కూడా విడుదల చేస్తున్నారు.

Read more: Mohanlal:  ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మలయాళ స్టార్ హీరో.. టెన్షన్ లో ఫ్యాన్స్... అసలేం జరిగిందంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News