వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి జగన్ కేబినెట్ ప్రత్యేకత గురించి వివరించారు. సీఎం జగన్ తన కేబినెట్ కూర్పు ఎవరూ ఊహించని రీతిలో తయారు చేశారని.. 60 శాతం బడుగు బలహీరన వర్గాలకే కేటాయించారని కొనియాడారు. ఇలాంటి కేబినెట్ కూర్పు దేశంలో ఎక్కడా అమలు కాలేదని లేదని ప్రసంశించారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేబినెట్ కూర్పు లేదన్నారు.
బీసీలకు సగబాగం నామినేట్ పోస్టులు
తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని ..జగన్ తన కేబినెట్ కూర్పూతోనే స్ట్రాంగ్ మెజేస్ పంపారని విజయసాయిరెడ్డి వివరించారు. ఇదే సందర్భంలో బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జగన్ తోనే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు
బాబు మౌన మునిగా మారారు ...
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గత చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమది బీసీలకు ప్రభుత్వమని చెప్పుకునే చంద్రబాబు ..బడుగుబలహీర వర్గాలకు ఈ స్థాయిలో మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానని కోతలు కోసిన చంద్రబాబుకు జగన్ గారి కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదని విమర్శించారు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా చంద్రబాబు మౌన ముని అవతారం ఎత్తారని విజయసాయిరెడ్డి ఎద్దేవ చేశారు
జగన్ గారి కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారే. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమే. బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చారు
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2019
ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానని కోతలు కోసిన చంద్రబాబుకు జగన్ గారి కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనీ బాబా అయ్యారు బాబు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2019