Kolkata Doctor murder: ఆర్ జీ కర్ ఆస్పత్రి చీకటి బాగోతలు.. గతంలోని మరణాల మిస్టరీలు తెలిస్తే షాక్ అవుతారు..

Rg kar hospital: కోల్ కత్తాలోని ఆర్ జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ ఘటనపై దేశంలో నిరసనలు మిన్నంటాయి. గతంలో ఈ ఆస్పత్రిలో అనేక మరణాలు ఇప్పటికి కూడా మిస్టరీలుగా ఉన్నాయని విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 19, 2024, 06:23 PM IST
  • ఆర్ జీ కర్ ఆస్పత్రిలో అన్ని దారుణాలు..
  • బైటకు వస్తున్న విస్తుపోయే విషయాలు..
Kolkata Doctor murder: ఆర్ జీ కర్ ఆస్పత్రి చీకటి బాగోతలు.. గతంలోని మరణాల మిస్టరీలు తెలిస్తే షాక్ అవుతారు..

Kolkata doctor murder case unfolds history of rg kar hospital: కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యచారం ఘటన దేశంలో అగ్గిరాజేసిందని చెప్పుకొవచ్చు.దీనిపైన దేశ వాప్త్యంగా మెడికోలు, డాక్టర్ లు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీనిపై ఒక రోజు నిరసలు తెలియజేస్తు, బంద్ ను పాటించి తమనిరసన తెలిపింది. కేంద్రం హోంశాఖ కూడా రాష్ట్రాలకు కూడా ఈ ఘటనపై అప్రమత్తం చేసింది. మరోవైపు ఈ ఘటనను సుప్రీంకోర్టు సైతం.. సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 9 న ట్రైనీ డాక్టర్ పై హత్యచార ఘటన కోల్ కతాతో పాటు యావత్ దేశంలో సంచలనంగా మారింది.

సెమినార్ లో యువతి అత్యంత దారుణ స్థితిలో చనిపోయి ఉండటంను సిబ్బంది గుర్తించారు.పోస్టు మార్టంలో ఆమెను దారుణంగా హింసించి, అత్యాచారం చేసిట్లు బైటపడింది. ఆమె శరీరంలో 150 ఎంఎల్ ల వీర్యం,  కళ్లు, నోట్లో నుంచి బ్లీడింగ్ జరిగినట్లు తెలుస్తోంది.  మరోవైపు.. ఆర్ కర్ ఆస్పత్రి ప్రిన్స్ పాల్ ను కూడా సీబీఐ విచారిస్తుంది. ఈ ఘటనలనో బీహర్ కు చెందిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అనేక విస్తూపోయే విషయాలు ప్రస్తుతం వార్తలలో ఉంటున్నాయి. ఆర్ కర్ ఆస్పత్రిలో అనేక చీకటి బాగోతాలు నడుస్తున్నాయనే హల్ చల్ చేస్తున్నాయి.

ట్రైనీ డాక్టర్ లతో వ్యభిచారం, అక్కడ డ్రగ్స్ దందా కూడా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్పత్రిలో అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా సీక్రెట్ గా జరుగుతుంటాయని కూడా కొంత మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. గతంలో జరిగిన అనేక మరణాలు కూడా సస్పెన్స్ గానే ఉన్నాయని వార్తలు టెన్షన్ పెట్టిస్తున్నాయి.

1. సౌమిత్ర బిస్వాస్ కేసు, 2001

2001 సంవత్సరంలో కోల్‌కతాలోని RG కార్ కాలేజీలో సౌమిత్ర బిస్వాస్ అనే 25 ఏళ్ల వైద్య విద్యార్థి అనుమానస్పదంగా చనిపోయాడు. అతను హస్టల్ లో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది.  అయితే, ఇది ఆత్మహత్య కేసు కాదని అతని స్నేహితులు ఆరోపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం ,  క్యాంపస్‌లో అశ్లీల కార్యకలాపాలను వంటి గుర్తించింనందుకు.. తన కొడుకును చంపేశారని  అతని తల్లి ఆరోపించింది. మృతుడి స్నేహితులు కూడా ఆరోపణలను సమర్థించారు. అతను 'చీకటి లావాదేవీలను' బహిర్గతం చేసిన తర్వాత అతన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.  అయితే, బిస్వాస్ మరణం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. 

2. హౌస్ సిబ్బంది  ఆత్మహత్య కేసు, 2003

2003 సంవత్సరంలో, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న హౌస్ సిబ్బంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతని స్నేహితులు అతను చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి అని,తన నరాలను కత్తిరించి పైకప్పు నుండి దూకి తన ప్రాణాలను తీసుకున్నాడని పేర్కొన్నారు. అతడిని అత్యవసర వార్డుకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మరణానికి సంబంధించిన పరిస్థితులు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. 

3. ఒక ప్రొఫెసర్ యొక్క రహస్య మరణం, 2016

RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన మరో సంచలన సంఘటన ఏమిటంటే, 2016లో గౌతమ్ పాల్ అనే 54 ఏళ్ల ప్రొఫెసర్ తన అద్దె అపార్ట్‌మెంట్‌లో  మరణించాడు. అతను హాస్పిటల్‌లో డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశాడు. అతను గదిలో నుంచి.. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో అతడి మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతని మృతదేహం నేలపై పడి ఉంది. అతని ముఖంపై కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇప్పటికి ఈ మరణం సైతం మిస్టరీగా ఉండిపోయింది.

4. పౌలోమి సాహా కేసు, 2020 

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పౌలోమి సాహా ఆసుపత్రి ప్రాంగణంలోని పైకప్పుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించినా కాపాడలేకపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు గత కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైంది. సౌమిత్ర మరణం వలె, పౌలోమి మరణం చాలా ప్రశ్నలను మిగిల్చింది, ఇంకా సమాధానం లేదు. 

5. ఇంటర్న్ మరణం, 2003

ఆర్‌జి కర్ కాలేజీలో మెడికల్ ఇంటర్న్ చదువుతున్న సువ్రోజిత్ తన నివాసంలో శవమై కనిపించాడు. అతని మరణానికి కారణం యాంటీ డిప్రెసెంట్స్ మితిమీరిన మోతాదులోనేనని పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ మరణంపై కూడా సరైన క్లారీటీ లేదు. మరోవైపు ఆస్పత్రిలో ఇన్ని మరణాలు జరిగిన, సీరియస్ గా చర్యలు తీసుకున్న ఘటనలు కానీ, విచారణలు గానీ జరిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది.

Read more: Konda Surekha: మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి.. రాఖీ కట్టడానికి వెళ్తుండగా.. వీడియో వైరల్..   

తాజాగా, ఇప్పుడు జూనియర్ డాక్టర్ హత్యచారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆర్ జీకర్ ఆస్పత్రి చీకటి బాగోతాలపై సీబీఐ లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులను కూడా విచారించి అందరికి న్యాయం చేయాలని  కూడా డాక్టర్ లు డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News