Hairfall Natural Tips: అందమైన, మందపాటి జుట్టు కోసం చాలా మంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆధునిక జీవనశైలిలో జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యం, కలుషిత ఆహారం వల్ల జుట్టు రాలడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి సరైన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టుకు మేలు చేసే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు:
ప్రోటీన్లు: మాంసం, చేప, చికెన్, గుడ్లు, పప్పులు, బీన్స్, పాల ఉత్పత్తులు వంటివి జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయి.
విటమిన్ ఎ: క్యారెట్లు, పాలకూర, గుమ్మడికాయ, చిలకడదుంపలు వంటి పసుపు, నారింజ రంగు కూరగాయలు విటమిన్ ఎ వంటివి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
విటమిన్ బి: బాదం, మాంసం, చేప, ఆకు కూరలు, బీన్స్ వంటివి విటమిన్ బి లభిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్.
విటమిన్ సి: నిమ్మకాయ, నారింజ, స్ట్రాబెర్రీ, బ్రోకలీ వంటి పండ్లు, కూరగాయలు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టును ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది.
ఐరన్: పాలకూర, బీట్ రూట్, చిక్కుడు, గోధుమలు వంటి ఆహార పదార్థాలు ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపం జుట్టు రాలడానికి కారణమవుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: సాల్మన్, ట్యూనా, అవిసె గింజలు, చియా గింజలు వంటి ఆహార పదార్థాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది.
జింక్: ఆస్టర్, గుమ్మడికాయ విత్తనాలు, బీన్స్ వంటి ఆహార పదార్థాలు జింక్ కి మంచి మూలాలు. జింక్ జుట్టు పెరుగుదలకు అవసరం.
జుట్టు ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు:
సమతుల్య ఆహారం తీసుకోవడం: అన్ని రకాల ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
నీరు ఎక్కువగా తాగడం: నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం: ప్రాసెస్ చేసిన ఆహారాలు జుట్టు ఆరోగ్యానికి హానికరం.
వ్యాయామం చేయడం: వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తగినంత నిద్ర: తగినంత నిద్ర జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం.
గమనిక:
జుట్టు రాలడం లేదా ఇతర జుట్టు సమస్యలు ఉన్నట్లయితే, ఒక డాక్టర్ లేదా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
Also readl: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook