Cobra Snake attacks on tiger in forest video goes viral: అడవిలో క్రూర జంతువులు తరచుగా సంచరిస్తుంటాయి. సింహలు, పెద్ద పులులకు చిక్కకుండా సాధు జంతువులు పారిపోతుంటాయి. కొన్నిసార్లు ఎంత పెద్ద జంతువైన తమకన్నా.. చిన్నగా ఉండే జంతువులను చూసి భయపడిపోతుంటాయి. కొన్నిసార్లు ఎంత బలమైన జంతువు అయిన కూడా.. తమ కన్నా.. అత్యంత చిన్నదైన జంతువు చేతిలో ఓడిపోతుంది. మనం తరచుగా సింహాలు దున్నలపై దాడులు చేయడం చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు దున్నపోతులు కూడా సింహంపై దాడులు చేస్తుంటాయి.
Tiger vs Cobra pic.twitter.com/egPKUsyJTm
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 17, 2024
అదే విధంగా అడవిలో పాములను చూస్తే.. మిగత జంతువులు భయంతో పారిపోతుంటాయి. కొన్నిసార్లు పాములు కూడా తమ కన్నా.. పెద్ద జంతువులకు చుక్కలు చూపిస్తుంటాయి. పాములకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తేనే భయం కల్గించేవిలా ఉంటాయి. మరికొన్ని ఫన్నీగాను ఉంటాయి. పాముల వెరైటీ వీడియోలను చూసేందుకు నెటిజన్లుసైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో మరో షాకింగ్ వీడియో వైరల్ గామారింది.
పూర్తి వివరాలు..
అడవిలో ఒక పెద్దపులి.. నీళ్లను తాగేందుకు వచ్చినట్టుంది. అప్పుడు అక్కడ నీళ్లలో ఒక కోబ్రా పాము వెళ్తుంది. ఇంతలో పెద్ద పులికన్నుకాస్త పాము మీద పడింది. పాము దగ్గరకు వెళ్లింది. ఇంతలోపాము.. ఒక్కసారిగా నా దగ్గరకు వస్తావా.. అన్న విధంగా పడగతో.. ఒక్క సారిగా కోపంగా పులి వైపుకు తిరుగుతుంది. . అంతే.. పెద్దపులి హడిలిపోయి.. అక్కడి నుంచి వెనక్కు జరిగిపోతుంది.
పాము ఏమాత్రం తగ్గకుండా.. పులి వైపుకు పాక్కుంటా ముందుకు వెళ్తుంది. పాపం.. పెద్దపులి మాత్రం.. మెల్లగా నాకేందుకు రిస్క్ అన్న విధంగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. పెద్దపులికి భలే చుక్కలు చూపించిందంటూ కామెంట్ లు పెడుతున్నారు.. మరికొందరు మాత్రం.. పాముతో పెట్టుకుంటే మటాషే అంటూ కామెంట్ లు ఫన్నీగా కౌంటర్ లు ఇస్తున్నారు.
Read more: Hot Romance: మెట్రోలో రెచ్చిపోయిన మరో జంట.. పచ్చిగా రొమాన్స్ చేసుకుంటూ... వీడియో వైరల్..
మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అడవిలో పాములు చాలా ప్రమాదకరంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. సింహాలు, ఏనుగులు సైతం పాములను చూసి భయంతో దూరంగా వెళ్లిపోతాయంట. పాముల జోలికి అస్సలు ఏ జంతువు కూడా సాహాసం చేయదని చెప్తుంటారు. కానీ ముంగీసలు మాత్రం పాములు కన్పిస్తే దాడులు చేస్తుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి